ఉత్తర్ప్రదేశ్లో కొందరు ఆకతాయిలు ఓ పెంపుడు కుక్కను హత్య చేశారు. యజమాని ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి.. మాంసం ముక్కల్లో విషం కలిపి ఈ దారుణానికి పాల్పడ్డారు. అమ్మాయిలను వేధిస్తున్న ఆ యువకులు తమ ఇంటి సమీపానికి వచ్చినప్పుడు కుక్కలు అరుస్తున్నందుకే చంపేశారని యజమాని ఫిర్యాదు చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
బస్తీ జిల్లాలోని పార్సకుర్ద్ ప్రాంతానికి చెందిన రాజన్ చౌదరి మూడు కుక్కలను పెంచుతున్నారు. అదే గ్రామానికి చెందిన కొందరు యువకులు అమ్మాయిలను వేధింపులకు గురిచేస్తున్నారు. వారంతా రాజన్ ఇంటి సమీపానికి వచ్చినప్పుడు.. రెండు జర్మన్ షెపర్డ్ జాతి కుక్కలతో మరో కుక్క మొరుగుతున్నాయి. గత కొంతకాలంగా ఇదే జరుగుతోంది.