తెలంగాణ

telangana

ETV Bharat / bharat

9 ఏళ్ల చిన్నారిపై 'జర్మన్ షెఫర్డ్' దాడి- యజమాని అరెస్ట్​ - చెన్నై వార్తలు

Dog bites girl: ఓ జర్మన్ షెఫర్డ్ శునకం 9 ఏళ్ల బాలికపై దాడి చేసి గాయపరిచింది. స్థానికులు ఈ విషయం గమనించి చిన్నారిని కాపాడారు. శునకం యజమానిని పోలీసులు అరెస్టు చేశారు.

Dog bites girl
9 ఏళ్ల చిన్నారిపై 'జర్మన్ షెఫర్డ్' దాడి- యజమాని అరెస్ట్​

By

Published : Jan 5, 2022, 8:36 AM IST

9 ఏళ్ల చిన్నారిపై 'జర్మన్ షెఫర్డ్' దాడి

Dog bites girl: తమిళనాడు చెన్నై నోలంబుర్​ శ్రీరాంనగర్​ మిలెనం అపార్ట్​మెంట్​ సమీపంలో 9 ఏళ్ల బాలికపై జర్మన్ షెఫర్డ్ శునకం దాడి చేసింది. చిన్నారిని వెంబడించి మరీ గాయపరించింది. కిందపడిన ఆమెను పలుమార్లు కరిచింది. స్థానికులు గమనించి శునకాన్ని తరిమివేశారు. అనంతరం బాలికను ఆస్పత్రికి తరలించారు.

ఈ ఘటనలో గాయపడిన చిన్నారి పేరు సరస్వతి. ఆమె ఆడుకుంటున్న సమయంలో విజయలక్ష్మి అనే మహిళ తన జర్మన్ షెఫర్డ్ శునకంతో బయటకు వచ్చింది. అయితే బాలికను చూసి కుక్క అరిచింది. దీంతో ఆ చిన్నారి భయపడి పరుగులు తీసింది. విజయలక్షి చేతుల నుంచి జారుకుని శునకం బాలికను వెంబడించింది. కిందపడిన ఆమెపై దాడి చేసింది. ఈ ఘటనకు సంబంధించి దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి.

శునకాన్ని జాగ్రత్తగా చూసుకోలేకపోయిన విజయలక్ష్మిని పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం వార్నింగ్ ఇచ్చి విడుదల చేశారు. మరోసారి ఇలా జరగకుండా చూసుకోవాలని తేల్చిచెప్పారు.

ఇదీ చదవండి:11సార్లు కరోనా టీకా వేసుకున్న 84ఏళ్ల వృద్ధుడు!

ABOUT THE AUTHOR

...view details