తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రూ.7లక్షలు ఖర్చుతో కుక్క బర్త్​డే పార్టీ- ముగ్గురు అరెస్ట్​ - పెంపుడు కుక్క బర్త్​డే పార్టీ

Dog Birthday Party Gujarat: కొవిడ్-19 నిబంధనలు ఉల్లంఘించి పెంపుడు శునకానికి బర్త్​డే నిర్వహించిన ముగ్గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. కుక్క పుట్టినరోజుకు ఏకంగా రూ. 7లక్షలు ఖర్చు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Dog birthday party
పెంపుడు కుక్క బర్త్​డే

By

Published : Jan 9, 2022, 2:08 PM IST

Updated : Jan 9, 2022, 2:44 PM IST

Dog Birthday Party Gujarat: పెంపుడు శునకాలపై యజమానులకు ప్రేమ సహజమే. అక్కడక్కడ వీటికి పుట్టిరోజులు కూడా చేస్తుంటారు. కానీ గుజరాత్, అహ్మదాబాద్​లోని కృష్ణానగర్​కు చెందిన సోదరులు చిరాగ్ పటేల్, ఊర్విష్​ పటేల్​ మాత్రం తమ పెంపుడు శునకం 'అబ్బీ' బర్త్​డేకు ఏకంగా రూ.7లక్షలు ఖర్చు చేశారు. కుక్క పుట్టినరోజును అంగరంగ వైభవంగా నిర్వహించారు.

పార్టీలో భాగంగా ఏర్పాటు చేసిన స్టేజీ

శుక్రవారం రాత్రి జరిగిన ఈ వేడుకలో అధిక సంఖ్యలో కుటుంబ సభ్యులు, స్నేహితులు పాల్గొన్నారు. పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ ఆనందంగా గడిపారు. అయితే కొవిడ్​-19 నిబంధనలకు విరుద్ధంగా ఈ వేడుక జరగడం వల్ల సోదరులతోపాటు, వారి స్నేహితుడు దివ్యేష్​ మెహారియాను అరెస్ట్ చేశారు పోలీసులు.

పెంపుడు కుక్క బర్త్​డే పార్టీలో బారీసంఖ్యలో జనం

ఈ వేడుకకు రూ. 7లక్షల వరకు ఖర్చు చేశారని పోలీసులు తెలిపారు. వేడుకలో ఎవ్వరూ.. మాస్కు ధరించకుండా, భౌతిక దూరం పాటించకుండా వ్యవహరించారని పేర్కొన్నారు.

పెంపుడు శునకం అబ్బీ
పోలీసుల అదుపులో నిందితులు

కొవిడ్ వ్యాప్తి దృష్ట్యా గుజరాత్​లో రాత్రి కర్ఫ్యూ అమల్లో ఉండటం వల్ల రాష్ట్రంలో ఇలాంటి వేడుకలకు అనుమతి లేదన్నారు పోలీసులు.

ఇదీ చూడండి:దేశంలో కరోనా ఉపద్రవం- ఒక్కరోజే 1.59 లక్షల కేసులు

Last Updated : Jan 9, 2022, 2:44 PM IST

ABOUT THE AUTHOR

...view details