తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పువ్వుల కోసం వెళ్లి బావిలో శవంగా తేలిన బాలిక.. కుక్కలే కారణం! - బిహార్​ న్యూస్

పువ్వులు కోయడానికి వెళ్లిన ముగ్గురు బాలికలపై వీధి కుక్కలు దాడి చేశాయి. వాటి నుంచి తప్పించుకునే క్రమంలో బావిలో పడి ఓ బాలిక మరణించగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన బిహార్​లోని బెగుసరాయ్​లో జరిగింది.

Dog Attack On Girls In Begusarai
Dog Attack On Girls In Begusarai

By

Published : Jul 25, 2022, 4:19 PM IST

బిహార్​ బెగుసరాయ్​లో పువ్వులు కోయడానికి వెళ్లిన ముగ్గురు బాలికలపై వీధి కుక్కలు దాడి చేశాయి. వాటి నుంచి తప్పించుకునే క్రమంలో బావిలో పడి ఓ బాలిక మరణించగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన సోమవారం ఉదయం జరిగింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

నవ్​కోఠి పోలీస్​ స్టేషన్ పరిధిలోని పహసర గ్రామానికి చెందిన నీలమ్​ కుమారి(15), రీటా(12),రమప్రీత్​(12) అనే ముగ్గురు బాలికలు సోమవారం ఉదయం పువ్వులు కోయడానికి వెళ్లగా వీధి కుక్కలు దాడి చేశాయి. వాటి నుంచి తప్పించుకునేందుకు బాలికలు పరుగెత్తారు. ఈ క్రమంలోనే వెళ్లి ఓ బావిలో పడ్డారు. బాలికల కేకలు విన్న స్థానికులు.. నిచ్చెన సాయంతో వారిని బయటకు తీశారు. ఈ ఘటనలో ఓ బాలిక ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరు బయటపడ్డారు. మృతురాలిని నీలమ్​ కుమారిగా గుర్తించారు. ఇద్దరి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details