తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆస్పత్రిలో కరోనా కలకలం- 87 మంది వైద్యులకు పాజిటివ్​ - వైద్యులకు కొవిడ్ పాజిటివ్​

Doctors test covid positive: ఆస్పత్రిలో 87 మంది వైద్యులకు కరోనా నిర్ధరణ కావడం కలకలం రేపింది. బిహార్​ పట్నాలో ఈ ఘటన జరిగింది. కొవిడ్ సోకిన వైద్యుల్లో చాలా మంది.. ఇటీవల జరిగిన భారతీయ వైద్యుల సంఘం(ఐఎంఏ) 96వ జాతీయ వార్షిక సదస్సుకు హాజరైన వారే కావడం గమనార్హం.

doctors test covid positive, patna doctors covid
పట్నాలో వైద్యులకు కరోనా​

By

Published : Jan 3, 2022, 11:10 AM IST

Doctors test covid positive: దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ బీభత్సం సృష్టిస్తోంది. రోజురోజుకు పెరుగుతున్న కేసులు.. కరోనా సెకండ్ వేవ్ నాటి రోజులను గుర్తుకుతెస్తున్నాయి. తాజాగా.. బిహార్​ పట్నాలోని నలంద వైద్య కళాశాల, ఆస్పత్రిలో(ఎన్ఎంసీహెచ్​) 87 మంది వైద్యులు కరోనా బారినపడడం కలకలం సృష్టించింది. అయితే.. ఇటీవల జరిగిన భారతీయ వైద్యుల సంఘం(ఐఎంఏ) 96వ జాతీయ వార్షిక సదస్సే ఈ వ్యాప్తికి కారణమైనట్లు తెలుస్తోంది.

Corona in nmch: "ఎన్ఎంసీహెచ్​లో 87 మంది వైద్యులకు కొవిడ్ పాజిటివ్​గా నిర్ధరణ అయింది. వారిలో చాలా మందికి లక్షణాలు లేవు. మరికొంతమందికి స్వల్ప లక్షణాలే ఉన్నాయి. వారంతా ఆస్పత్రి క్యాంపస్​లో ఐసొలేషన్​లో ఉన్నారు" అని పట్నా కలెక్టర్ చంద్రశేఖర్ సింగ్ తెలిపారు.

ఎన్ఎంసీహెచ్​లో మొత్తం 194 నమూనాలకు ఆర్​టీ-పీసీఆర్​ పరీక్షలు నిర్వహించగా.. అందులో శనివారం 12 మందికి కరోనా సోకినట్లు తేలగా.. మరో 75 మందికి ఆదివారం వైరస్​ నిర్ధరణ అయింది. అయితే.. కొవిడ్​ సోకిన వారిలో ఐదుగురు మాత్రమే ఆస్పత్రిలో చేరగా.. మిగతా వారంతా హోం ఐసొలేషన్​లో ఉన్నట్లు తెలుస్తోంది.

ఆ సదస్సుకు హాజరైన వారే..

Ima natcon 2021: కరోనా నిర్ధరణ అయిన ఎన్ఎంసీహెచ్ వైద్యుల్లో చాలా మంది డిసెంబరు 27, 28 తేదీల్లో జరిగిన ఐఎంఏ జాతీయ వార్షిక సదస్సుకు హాజరైన వారే కావడం గమనార్హం. ఈ సదస్సుకు బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. శనివారం పట్నా ఎయిమ్స్​కు చెందిన ఇద్దరు వైద్యులకు కరోనా సోకినట్లు తేలింది.

అప్రమత్తంగా..

Bihar covid cases: ఎన్ఎంసీహెచ్​ వైద్యులు కరోనా బారినపడిన నేపథ్యంలో పట్నా జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. వైరస్​ బాధితులతో సన్నిహితంగా మెదిలిన వారిని గుర్తించే చర్యలు ముమ్మరం చేసింది. కరోనా సెకండ్ వేవ్ సమయంలో.. వైరస్ ధాటికి ప్రాణాలు కోల్పోయిన వైద్యులు బిహార్​లో అధికంగా ఉన్నారని ఐఎంఏ గతంలో తెలిపింది.

ఇదీ చూడండి:Corona Vaccination: పిల్లలకు నేటి నుంచి కొవిడ్‌ టీకా

ఇదీ చూడండి:దేశంలో భారీగా పెరిగిన కరోనా కేసులు- ఒక్కరోజే 33,750 మందికి వైరస్​

ABOUT THE AUTHOR

...view details