Doctors test corona positive: బిహార్‌లో కొవిడ్-19 బారినపడుతున్న వైద్యుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. నలంద వైద్య కళాశాల, ఆసుపత్రి(ఎన్ఎంసీహెచ్)లో తాజాగా మరో 72 మంది వైద్యులకు వైరస్ పాజిటివ్‌గా తేలినట్లు మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ వినోద్ కుమార్ సింగ్ తెలిపారు. జనవరి 1, 2 తేదీల మధ్య 87 మంది వైద్యులు వైరస్‌బారిన పడగా.. తాజా కేసులతో ఆసుపత్రిలో నాలుగు రోజుల్లోనే మొత్తం కేసుల సంఖ్య 159కి చేరిందన్నారు.
డిసెంబర్ 27, 28 తేదీల్లో పట్నాలో జరిగిన భారతీయ వైద్యుల సంఘం 96వ జాతీయ వార్షిక సదస్సులో పాల్గొన్న వైద్యులకు కరోనా నిర్ధరణ అవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ సదస్సుకు బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
ఎన్ఎంసీహెచ్ వైద్యులు కరోనా బారినపడిన నేపథ్యంలో పట్నా జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. వైరస్ బాధితులతో సన్నిహితంగా మెదిలిన వారిని గుర్తించే చర్యలు చేపట్టింది. కరోనా రెండో దశ సమయంలో.. వైరస్ ధాటికి ప్రాణాలు కోల్పోయిన వైద్యులు బిహార్‌లోనే అధికంగా ఉన్నారని ఐఎంఏ గతంలో తెలపటం గమనార్హం.
102 మంది వైద్య విద్యార్థులకు కరోనా