Doctors Removed Needle From Lungs : వైద్యులు దేవుళ్లతో సమానమనే నానుడి మనమందరం చాలా సార్లే విని ఉంటాం. ఇప్పుడు అదే విషయం మరోసారి రుజువైంది. ఓ వ్యక్తి ఊపిరితిత్తుల్లో ఇరుక్కున్న పిన్ను విజయవంతంగా బయటకు తీశారు హరియాణా డాక్టర్లు. నాలుగు గంటల పాటు శ్రమించి.. రెండు ఇంచుల పిన్ను శరీరం నుంచి వెలికితీసి బాధితుడి ప్రాణాలను కాపాడారు. చాలా క్లిష్టమైన పనిని మేజర్ ఆపరేషన్ చేయకుండానే పూర్తి చేశారు వైద్యులు.
ఇదీ జరిగింది
రోహ్తక్ జిల్లాలోని బాడా బజార్‌కు చెందిన 55 ఏళ్ల వ్యక్తి.. డెంటల్ చెక్అప్ కోసం ఓ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లాడు. చికిత్స చేస్తుండగా.. అనుకోకుండా రెండు ఇంచుల పిన్ అతడి నోటి గుండా శరీరంలోకి వెళ్లింది. దీంతో వెంటనే అతడ్ని PGIMS రోహ్తక్ ఆసుపత్రికి తరలించారు. అనంతరం అత్యవసర విభాగంలో చేర్పించారు. బాధితుడికి వివిధ పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. ఆ పిన్ ఎడమ ఊపిరితిత్తుల్లో ఇరుక్కుందని గుర్తించారు. మొదట పెద్ద బ్రోంకోస్కోప్ ద్వారా పిన్ను బయటకు తీయాలని వైద్యులు భావించారు. కానీ అది వీలు కాకపోవడం వల్ల చిన్న బ్రోంకోస్కోప్ ద్వారా పిన్ను బయటకు తీసి విజయవంతంగా ఆపరేషన్ పూర్తి చేశారు.
ఊపిరితిత్తుల్లో ఇరుక్కున్న పిన్ "మొదట రోగికి CT స్కాన్ చేశాం. ఆ పరీక్షల్లో పిన్ ఎక్కడుందో కనిపించలేదు. దీంతో మరోసారి CT స్కాన్ చేశాం. అందులో పిన్ ఉన్న ప్లేస్ తెలిసింది." అని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం రోగి ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడని వారు వెల్లడించారు. ఆపరేషన్‌లో కాస్త రక్తస్త్రావం తప్ప మరో ఇబ్బంది కలగలేదని వైద్యులు వివరించారు. రోగిని ఇంటికి కూడా పంపిచినట్లు వారు పేర్కొన్నారు. డాక్టర్ పవన్ అధ్వర్యంలో డాక్టర్ అమన్, టెక్నీషియన్ అశోక్, సుమన్, సునీల్, భావన తదితరులు ఈ ఆపరేషన్‌లో భాగం అయ్యారు. కాగా పేషెంట్ కుటుంబ సభ్యులు వైద్యులకు కృతజ్ఞతలు తెలిపి.. తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
గాల్ బ్లాడర్‌లో 630 రాళ్లు.. ఫ్రీగా సర్జరీ చేసిన వైద్యులు!
15 రోజుల క్రితం గుజరాత్ అహ్మదాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి గత కొంతకాలంగా గాల్ బ్లాడర్, సికిల్ సెస్ వ్యాధితో బాధపడుతున్నాడు. దీంతో పిత్తాశయంలో 630 ఏర్పడి రాళ్లు ఏర్పడి.. మూత్ర విసర్జన సమయంలో తీవ్ర ఇబ్బంది ఎదుర్కొన్నాడు. అతడి పరిస్థితి తెలుసుకొని.. నిపుణులతో కూడిన వైద్య బృందం అధునాతన సాంకేతికతతో.. ఎండోస్కోపిక్ రెట్రోగ్రేడ్ కోలాంగియో పాంక్రియాటోగ్రఫీ (ERCP) ద్వారా శస్త్ర చికిత్స చేసింది. గాల్ బ్లాడర్‌లో ఉన్న 630 రాళ్లను తొలగించింది. పిత్తాశయంలో రాళ్లను తొలగించడానికి శస్త్ర చికిత్సలో లాపరోస్కోపిక్ కోలెసెక్టోమిని వైద్యులు ఉపయోగించారు..