Doctors infected with covid: దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. అదే సమయంలో పలు రాష్ట్రాల్లో వైద్యులు సైతం పెద్ద సంఖ్యలో కొవిడ్ బారిన పడుతున్నారు. కోల్‌కతాలోని మూడు వేర్వేరు ఆస్పత్రుల్లో కలిపి 106 మంది వైద్యులకు కరోనా పాజిటివ్‌గా తేలిందని సీనియర్ వైద్యాధికారులు వెల్లడించారు.
Kolkata Doctors covid:
కలకత్తా నేషనల్ మెడికల్ కాలేజీలో 70 మంది వైద్యులకు కొవిడ్ సోకిందని చెప్పారు. చిత్తరంజన్ సేవా సదన్, శిశు సదన్ ఆస్పత్రిలో పని చేసే 24 మంది మెడికల్ ప్రాక్టీషనర్లు, రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆఫ్తమాలజీకి చెందిన 12 మందికి వైరస్ పాజిటివ్‌గా నిర్ధరణ అయిందని వివరించారు. 'కరోనా సోకిన వైద్యులందరినీ సంస్థాగత క్వారంటైన్‌కు వెళ్లాలని సూచించాం. కాంటాక్ట్ ట్రేసింగ్ మొదలు పెట్టాం. మూడు ఆస్పత్రుల్లో సిబ్బందికి పరీక్షలు నిర్వహిస్తున్నాం' అని అధికారులు స్పష్టం చేశారు.
Patna Doctors covid positive
మరోవైపు, బిహార్ పట్నాలోని నలంద వైద్య కళాశాల, ఆస్పత్రిలో(ఎన్ఎంసీహెచ్) 87 మంది వైద్యులు కరోనా బారినపడడం కలకలం సృష్టించింది. ఎన్ఎంసీహెచ్లో మొత్తం 194 నమూనాలకు ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు నిర్వహించగా.. అందులో శనివారం 12 మందికి కరోనా సోకినట్లు తేలింది. మరో 75 మందికి ఆదివారం వైరస్ నిర్ధరణ అయింది. అయితే.. కొవిడ్ సోకిన వారిలో ఐదుగురు మాత్రమే ఆస్పత్రిలో చేరగా.. మిగతా వారంతా హోం ఐసొలేషన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.
"ఎన్ఎంసీహెచ్లో 87 మంది వైద్యులకు కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. వారిలో చాలా మందికి లక్షణాలు లేవు. మరికొంతమందికి స్వల్ప లక్షణాలే ఉన్నాయి. వారంతా ఆస్పత్రి క్యాంపస్‌లో ఐసొలేషన్‌లో ఉన్నారు."