కొవిడ్‌తో రోగి మరణించగా.. అతని బంధువులు ఆసుపత్రికి వచ్చి వైద్యుడిపై దాడి చేశారు. ఈ ఘటన అసోంలోని హోజై జిల్లాలో జరిగింది. డాక్టర్‌పై దాడి చేసిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.
ఏం జరిగింది?
కరోనాతో తీవ్ర అస్వస్థతకు గురైన ఓ వ్యక్తి చికిత్స పొందుతూ ఉదాలీ కోవిడ్ కేర్ సెంటర్‌లో మంగళవారం మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మృతుని బంధువులు, ఆసుపత్రికి వచ్చి డాక్టర్. సుయజ్ కుమార్‌పై దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో.. 24 మంది నిందితులను అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు.
వైద్యుడిపై దాడి చేస్తున్న మృతుడి బంధువులు రోగికి ఉదయం నుంచి మూత్రం రాలేదని వైద్య సిబ్బంది చెప్తే.. చికిత్స అందించేందుకు వెళ్లానని, అప్పటికే రోగి మృతి చెంది ఉన్నాడని డాక్టర్.సుయజ్ కుమార్ తెలిపారు.
అనాగరిక చర్య..
ఈ ఘటనపై అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ స్పందించారు. వైద్యుడిపై దాడిని అనాగరిక చర్యగా అభివర్ణించారు. డాక్టర్లు, ఫ్రంట్‌లైన్ వర్కర్లపై ఇటువంటి దాడులను తమ ప్రభుత్వం సహించబోదన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. వైద్యులపై దాడికి పాల్పడిన వారిపై సాంక్రమిక వ్యాధుల చట్టం, 1897 కింద చర్యలు తీసుకోవాలని ఎయిమ్స్ వైద్యులు డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి :బెంచ్‌లో ఇరుక్కుపోయిన చిన్నారి.. చివరికి!