తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మహిళ గర్భాశయంలో సూది వదిలేసిన వైద్యులు! - Doctor Leaves Broken Needle In Womans Uterus During Family Planning Operation

కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసిన సమయంలో ఓ మహిళ గర్భాశయంలో సూదిని ఉంచేసి కుట్లు వేశారు. దాంతో ఆమె తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సివచ్చింది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు బాధితురాలి కుటుంబ సభ్యులు. ఈ ఘటన ఒడిశాలో జరిగింది.

Doctor Leaves Broken Needle In Womans Uterus During Family Planning Operation
వైద్యుడి నిర్లక్ష్యంతో మహిళ గర్భాశయంలో సూది

By

Published : Mar 25, 2021, 3:02 PM IST

ఒడిశాలో వైద్యుడి నిర్లక్ష్యం ఓ మహిళ తీవ్ర అనారోగ్యానికి గురయ్యేలా చేసింది. పొట్టలో నొప్పితో మూడు జిల్లాల్లో 4 ఆసుపత్రుల చుట్టూ తిరిగాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఇంతకీ ఏం జరిగిందంటే..?

కోరాపుట్​ జిల్లా నందాపుర్​ బ్లాకులో పరాటా గ్రామానికి చెందిన సావిత్రి మజ్​హి.. జయపుర్​లోని జిల్లా కేంద్ర ఆసుపత్రి(డీహెచ్​హెచ్​)లో మార్చి 16న కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేయించుకుంది. ఆ తర్వాత పొత్తి కడుపులో నొప్పి వచ్చినట్లు కుటుంబ సభ్యులకు తెలిపింది. దీంతో వైద్యుల సూచన మేరకు ఎక్స్​-రే తీయగా అందులో విరిగిన సూది ఉన్నట్లు తేలింది. ఆ సూదిని బయటకు తీసేందుకు.. వెంటనే ఎన్​ఎల్​ఎన్ వైద్య కళాశాల ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు డీహెచ్​హెచ్ వైద్య సిబ్బంది.

అయితే అక్కడ కూడా అందుకు తగిన చికిత్స అందుబాటులోలేక.. వేరే ఆసుపత్రికి తరలించారు. చివరకు ఎస్​సీబీ ఆసుపత్రిలో వైద్యుల బృందం రెండు గంటలపాటు శ్రమించి విజయవంతంగా ఆ సూదిని బయటకు తీశారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు పేర్కొన్నారు.

ఇదీ చూడండి:వృద్ధురాలిపై అత్యాచారం.. కత్తితో దాడి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details