అందరికీ సకాలంలో వ్యాక్సిన్ అందేలా చూడాలని కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్పందిస్తూ.. కేంద్ర రసాయన, ఎరువుల మంత్రిత్వ శాఖ మంత్రి సదానంద గౌడ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు తయారీ సంస్థలు వ్యాక్సిన్ ఉత్పత్తి చేయలేకపోతే అధికారులు ఉరివేసుకోలేరు కదా! అని అన్నారు.
"రాజకీయ లబ్ధి కోసం కాకుండా నిజాయితీగా ప్రయత్నిస్తున్నాము. కానీ కావాల్సినంత వ్యాక్సిన్ ఉత్పత్తి జరగట్లేదు. అది మన పరిధిని దాటి ఉంది. అందిరికీ వ్యాక్సిన్ అందించాలని కోర్టులు చెబుతాయి. కానీ వ్యాక్సిన్ ఉత్పత్తి చాలినంత లేకపోతే ఏం చేస్తారు? అధికారులు ఉరి వేసుకోలేరు కదా! ప్రధాని మోదీనే వ్యాక్సిన్ ప్రచారకునిగా ఉన్నారు. మరో వారంలో సందేహాలు తీరిపోతాయి."