రానున్న తమిళనాడు ఎన్నికల్లో డీఎంకే పార్టీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ అధినేత స్టాలిన్ ధీమా వ్యక్తం చేశారు. గోబిచెట్టిపాలయం నియోజకవర్గంలో ఓ కార్యక్రమంలో స్టాలిన్ పాల్గొన్నారు. ప్రజలంతా తమ పార్టీనే ఎన్నుకునేందుకు సిద్ధమయ్యారని జోస్యం చెప్పారు. 4 నెలల్లోనే డీఎంకే అధికారాన్ని కైవసం చేసుకుంటుందని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతిలో కూరుకుపోయిన అన్నాడీఎంకే మంత్రులపై విచారణ జరిపి శిక్ష విధిస్తామని చెప్పారు.
తమిళనాట వచ్చేది డీఎంకే ప్రభుత్వమే: స్టాలిన్ - డీఎంకే స్టాలిన్
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాట డీఎంకే గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆ పార్టీ అధినేత స్టాలిన్ ధీమా వ్యక్తం చేశారు. తమిళ ప్రజలు డీఎంకేనే ఎన్నుకుంటారని జోస్యం చెప్పారు.
'4 నెలల్లోనే డీఎంకే అధికారాన్ని కైవసం చేసుకుంటుంది'
శశికళ వల్లే పళనిస్వామి ముఖ్యమంత్రి అయ్యారని వ్యాఖ్యానించారు. జయలలిత మరణంపై సమగ్ర దర్యాప్తు చేయిస్తామని తెలిపారు.
ఇదీ చదవండి :అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ 'పోల్ ప్యానెళ్లు'