తెలంగాణ

telangana

By

Published : Dec 5, 2020, 3:32 PM IST

Updated : Dec 5, 2020, 3:46 PM IST

ETV Bharat / bharat

వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా డీఎంకే, ఆర్జేడీ నిరసనలు

కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తున్నాయి. ఈ క్రమంలో చెన్నైలో డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ నేతృత్వంలో.. పట్నా లో ఆర్​జేడీ నేత తేజస్వీ యాదవ్​ ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహించారు.

DMK, RJD protests against agricultural bills
వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా డీఎంకే, ఆర్జేడీ నిరసనలు

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశంలోని పలు రాష్ట్రాల్లో కూడా ఆందోళనలు కొనసాగుతున్నాయి. చెన్నైలో డీఎంకే ఆధ్వర్వంలో భారీ నిరసన ప్రదర్శన జరిగింది. డీఎంకే అధ్యక్షుడు ఎం.కే స్టాలిన్‌ సహా పెద్ద సంఖ్యలో రైతులు, ఆ పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. డీఎంకే కార్యకర్తలు నల్ల దుస్తులు ధరించి నిరసన తెలిపారు.

కార్యక్రమంలో మాట్లాడుతున్న స్టాలిన్​
ఓ రైతు వినూత్న నిరసన
చెన్నైలో నిరసన ప్రదర్శనకు హాజరైన కార్యకర్తలు

వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ న్యాయ స్థానాన్ని ఆశ్రయిస్తామని స్టాలిన్ తెలిపారు. పంజాబ్, కేరళ రాష్ట్రాలు ఇప్పటికే కోర్టును ఆశ్రయించినట్లు పేర్కొన్నారు. రైతుల శ్రేయస్సే తొలి ప్రాధాన్యం అని చెప్పే తమిళనాడు సీఎం పళనిస్వామి కొత్త చట్టాలను ఎందుకు వ్యతిరేకించడం లేదని స్టాలిన్‌ ప్రశ్నించారు.

నిరసన కార్యక్రమంలో ఆర్జేడీ నేత తేజస్వీ
పట్నాలో నిరసన
పట్నాలో జరిగిన ఆందోళన కార్యక్రమంలో తేజస్వీ

బిహార్‌ రాజధాని పట్నాలో సైతం వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు జరిగాయి. ఆర్​జేడీ నేత తేజస్వీ యాదవ్ నేతృత్వంలో భారీ నిరసన ప్రదర్శన జరిగింది.

ఇదీ చూడండి: సాగు చట్టాల్లో సవరణలకు కేంద్రం ఓకేనా?

Last Updated : Dec 5, 2020, 3:46 PM IST

ABOUT THE AUTHOR

...view details