మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగనున్న తమిళనాడులో డీఎంకేకు మరో షాక్ తగిలింది. మధురై తిరుపుప్పరన్కుండ్రమ్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ పార్టీ ఎమ్మెల్యే శరవణన్.. భాజపాలో చేరారు. ఫలితంగా భాజపాలో చేరిన డీఎంకే ఎమ్మెల్యేల సంఖ్య రెండుకు పెరిగింది.
భాజపా గూటికి మరో డీఎంకే ఎమ్మెల్యే
తమిళనాడు ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. డీఎంకేకు షాక్ ఇచ్చారు ఆ పార్టీ ఎమ్మెల్యే శరవణన్. పార్టీ నాయకులతో విభేదాల కారణంగా భాజపాలో చేశారు.
భాజపాలో చేరిన మరో డీఎంకే ఎమ్మెల్యే
పార్టీ జిల్లా స్థాయి నాయకులతో విభేదాల కారణంగానే డీఎంకేను వీడుతున్నట్లు శరవణన్ తెలిపారు. వెనువెంటనే భాజపా విడుదల చేసిన అభ్యర్థుల జాబితాలో మధురై ఉత్తర నియోజకవర్గం టిక్కెట్పొందారు. గతంలో డీఎంకే ఎమ్మెల్యే కుకా సెల్వమ్ భాజపాలో చేరారు.
ఇదీ చదవండి:జేడీయూలో ఆర్ఎల్ఎస్పీ విలీనం