తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆత్మహత్యాయత్నంపై ఎమ్మెల్యే అరుణ క్లారిటీ - డీఎంకే ఎమ్మెల్యే ఆత్మహత్యాయత్నం

పార్టీ కలహాల కారణంగా డీఎంకే ఎమ్మెల్యే ఆలడి అరుణ ఆత్మహత్యాయత్నం చేసుకున్నారన్న వార్తలను ఆమె ఖండించారు. శరీరంలో చక్కెర స్థాయి పడిపోయిన కారణంగా ఆసుపత్రిలో చేరినట్లు వివరణ ఇచ్చారు.

DMK MLA
ఎమ్మెల్యే అరుణ

By

Published : Nov 20, 2020, 10:18 PM IST

తమిళనాడులోని డీఎంకే ఎమ్మెల్యే ఆలడి అరుణ ఆత్మహత్యాయత్నం చేశారంటూ వచ్చిన వదంతులకు ఆమె చెక్ పెట్టారు. శరీరంలో చక్కెర స్థాయి తగ్గటమే ఆసుపత్రిలో చేరడానికి కారణమని తెలిపారు. వైద్యుల సలహామేరకు సీటీ స్కాన్​ తీసుకున్నట్లు వివరణ ఇచ్చారు.

నిజాలు తెలుసుకోకుండా ఇలాంటి వదంతులను ప్రచురించడాన్ని తప్పుబట్టారు అరుణ.

ఇదీ జరిగింది..

తిరునెల్వేలిలోని ఓ ఆసుపత్రిలో అరుణ గురువారం చేరగా... ఆమె పరిస్థితి కాస్త విషమంగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. పార్టీలో అంతర్గత కలహాల వల్ల ఆమె ఆత్మహత్యాయత్నం చేసుకున్నారన్న వార్తలు ప్రకంపనలు సృష్టించాయి. తొలుత ఈ వార్తలను డీఎంకే పార్టీ నేతలు ఖండించారు.

ఇదీ చూడండి:ఎమ్మెల్యే 'ఆత్మహత్యాయత్నం'పై దుమారం

ABOUT THE AUTHOR

...view details