MLA turned as govt bus driver: తమిళనాడు అధికార పార్టీ డీఎంకే ఎమ్మెల్యే నివేద మురుగన్ బస్సు డ్రైవర్గా మారారు. ప్రయాణికులతో నిండిన బస్సును సుమారు ఆరు కిలోమీటర్ల మేర తోలుకెళ్లారు. ఆయన నియోజకవర్గం పూమ్పుహార్లో నిర్వహించిన ప్రభుత్వ బస్సు సేవల ప్రారంభోత్సవంలో ఈ సంఘటన జరిగింది.
ఐదేళ్ల తర్వాత.. తిరువిడైకళి నుంచి మైలాడుతురై మధ్య బస్సు సర్వీసును పునరుద్ధరించింది ప్రభుత్వం. తిరువిడైకళిలో నిర్వహించిన కార్యక్రమంలో జెండా ఊపి బస్సు సేవలను ప్రారంభించారు ఎమ్మెల్యే మురుగన్. ఆ తర్వాత డ్రైవర్ అవతారమెత్తిన మురుగన్ ప్రయాణికులతో ఉన్న బస్సును 6 కిలోమీటర్లు తీసుకెళ్లి.. అందరిని ఆశ్చర్యానికి గురిచేశారు.