డీఎంకే మాజీ ఎంపీ మస్తాన్ కారులో వస్తుండగా ఇటీవలే మరణించారు. అయితే అది సాధారణ మరణంగా అందరూ భావించారు. కానీ పోలీసుల విచారణలో మస్తాన్‌ది హత్యగా తేలింది. డబ్బుల లావాదేవీల విషయంలో గొడవ వల్ల మస్తాన్‌ను.. ఆయన తమ్ముడి అల్లుడు ఇమ్రాన్‌తో పాటు మరో నలుగురు కలిసి ఈ హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులు.. నజీర్, ఇమ్రాన్ భాషా, తౌఫిక్ అహ్మద్, లోకేశ్, తమీమ్‌లను అరెస్ట్ చేశామని పేర్కొన్నారు.
ఇదీ జరిగింది..
డిసెంబరు 22న తన కుమారుడి వివాహానికి పార్టీ నేతలు, పలువురు ప్రముఖులను ఆహ్వానించేందుకు మస్తాన్(66) తన కారులో తిరుచ్చి వెళ్లాడు. మస్తాన్ వెంట అతని తమ్ముడి అల్లుడు ఇమ్రాన్, డ్రైవర్ లోకేశ్ ఉన్నారు. ఇంటి తిరిగి వచ్చే సమయంలో ఇమ్రాన్ తన స్నేహితులతో కలిసి మస్తాన్‌ను గొంతు నులిమి హత్య చేశాడు. ఈ హత్యను సహజ మరణంగా చిత్రీకరించేందుకు మస్తాన్‌కు ఛాతీలో నొప్పి వచ్చిందని గుడవంచెరిలోని ఓ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మస్తాన్ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ప్రస్తుతం మస్తాన్.. తమిళనాడు మైనారిటీ కమిషన్ వైస్ ఛైర్మన్‌గా ఉన్నారు.