డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ శాసనసభాపక్షనేతగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు పార్టీ.. తన అధికారిక ట్విట్టర్ ద్వారా తెలిపింది. ఈ సమావేశంలో 133 మంది డీఎంకే ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. మే 7న స్టాలిన్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కరోనా దృష్ట్యా ఈ కార్యక్రమాన్ని నిరాడంబరంగానే నిర్వహించనున్నట్లు స్టాలిన్ ఇదివరకే తెలిపారు.
శాసనసభాపక్షనేతగా స్టాలిన్- 7న సీఎంగా ప్రమాణం
డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ శాసనసభాపక్షనేతగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మే 7న తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.
స్టాలిన్
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 234 స్థానాలకు గానూ.. డీఎంకే కూటమి 158 స్థానాల్లో గెలిచి సంపూర్ణ ఆధిక్యం సాధించింది.
ఇదీ చదవండి :డీఎంకే సక్సెస్ మంత్ర.. 'స్టాలిన్'!