తమ పార్టీ మేనిఫెస్టోను అన్నాడీఎంకే కాపీ కొట్టిందని ఆరోపించారు డీఎంకే అధినేత స్టాలిన్. ఇటీవల ఆ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టో తమ పార్టీ రూపొందించిన మేనిఫెస్టోకు జిరాక్స్ కాపీలా ఉందని పేర్కొన్నారు. తిరువరూర్లో సోమవారం నిర్వహించిన ర్యాలీలో ఈ వ్యాఖ్యలు చేశారు.
"నేను ఏం ప్రకటిస్తానా అని అన్నాడీఎంకే ఎదురు చూస్తోంది. ఆ పార్టీ ప్రకటించిన రుణ మాఫీ, పింఛన్ పెంపు, మహిళలకు ప్రోత్సాహకాలు.. ఇవన్నీ డీఎంకే ప్రకటించినవే. అందరికీ విమానాలు పంపిణీ చేస్తామని ఆ పార్టీ ప్రకటించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే వారు మళ్లీ అధికారంలోకి తిరిగిరారు. నేను మాజీ ముఖ్యమంత్రి తనయుడిగా ఇక్కడికి వచ్చాను. మీరందరరూ నన్ను గెలిపిస్తారని ఆశిస్తున్నాను. గెలిపిస్తారు కదూ?"
-స్టాలిన్, డీఎంకే అధినేత