ఏప్రిల్ 6న జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు 173మందితో కూడిన అభ్యర్థుల జాబితాను ప్రకటించింది డీఎంకే. పార్టీ అధినేత స్టాలిన్, కోలాతూర్ నియోజకవర్గం నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఆయన కుమారుడు ఉదయనిధి,చేపాక్- ట్రిప్లికేన్ నియోజకవర్గం నుంచి బరిలో దిగనున్నారు.
పార్టీలో పేరుపొందిన దురై మురుగన్, కె.ఎన్.నెహ్రూ, కె.పోన్ముడి, ఎమ్ఆర్కే పన్నీర్‌సెల్వంతో పాటు దాదాపు సిట్టింగ్ ఎమ్మెల్యేలకే స్టాలిన్ ప్రధాన్యతనిచ్చారు. మార్చి 15న నామినేషన్ దాఖలు చేయనున్నట్లు వెల్లడించారు.