తమిళనాడులోని డీఎంకే నేతృత్వంలోని విపక్షాలు.. రైతులకు మద్దతుగా ఒకరోజు పాటు నిరాహార దీక్ష చేపట్టాయి. కేంద్రం అమలు చేసిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా రైతులు నిరసనలు చేపడుతోన్న నేపథ్యంలో డీఎంకే ఈ దీక్షకు పిలుపునిచ్చింది.
" వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దీక్ష చేపట్టేవారు జాతీయ వ్యతిరేకవాదులని కేంద్రం చెబుతోంది. దీన్ని మేం ఖండిస్తున్నాం. మేం రైతులకు మద్దతుగానే నిలుస్తాం".