తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దిల్లీలో అగ్ని ప్రమాదం- ఇద్దరు చిన్నారులు మృతి - దిల్లీ చెప్పుల కర్మాగారం లో అగ్ని ప్రమాదం

దిల్లీలో ఓ చెప్పుల కర్మాగారంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. అగ్ని మాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.

delhi fire accident
దిల్లీలో అగ్ని ప్రమాదం..ఇద్దరు చిన్నారులు మృతి

By

Published : Dec 18, 2020, 11:13 PM IST

దిల్లీలోని ఓ చెప్పుల కర్మాగారంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. సాగర్​పురా ప్రాంతంలోని ఓ ఇంటి గ్రౌండ్​ ఫ్లోర్​లో చెప్పుల కర్మాగారం ఉంది. పై ఫ్లోర్​లో ఫాక్టరీ యజమాని నివాసం ఉంది. ఇద్దరు పిల్లలు మాత్రమే ఇంట్లో ఉన్నారు. ఇంటికి గేట్​ వేసి వారి తల్లి మార్కెట్​కి వెళ్లింది. ఇంతలోనే కర్మాగారంలో మంటలు చెలరేగాయి.

చిన్నారులు ఆయుష్(5), పార్శియన్(4) ఈ ప్రమాదంలో మృతిచెందారు. ఎంత ప్రయత్నించినా పిల్లల్ని కాపాడలేకపోయామని స్థానికులు చెప్పారు.

సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. స్థానిక ఎమ్మెల్యే ఘటన ప్రదేశానికి వచ్చి పరిశీలించారు. షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగాయని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details