తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దివాళీ టపాసులు - మీ కారు బూడిదైనా కావొచ్చు - ఈ సేఫ్టీ కంపల్సరీ!

Diwali 2023 Car Parking Safety Tips From Crackers : దీపావళి పండగ నాడు.. టపాసుల మోతలతో ఊరూవాడా మోతెక్కిపోతాయి. పిల్లల నుంచి పెద్దల దాకా అందరూ.. ఆనందాల్లో మునిగితేలుతారు. అయితే.. ఎంతో ఇష్టపడి కొనుగోలు చేసిన మీ వాహనాలకు.. టపాసుల నుంచి ముప్పు పొంచి ఉంటుంది. కొందరు పిల్లలు కావాలనే వాహనాల కింద టపాసులు పేలుస్తారు. అందుకే.. పార్కింగ్​ విషయంలో ఈ జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి.

By ETV Bharat Telugu Team

Published : Nov 10, 2023, 10:51 AM IST

Car Parking Safety Tips
Car Parking Safety Tips

Diwali 2023 Car Parking Safety Tips From Crackers :దీపావళి పండగ మరో రెండు రోజులే ఉంది. దీంతో.. క్రాకర్స్ ఇంటింటికీ చేరుతున్నాయి. ఇక, పండగ రోజున ఊరూవాడా మోతెక్కిపోతాయి. ప్రధాన రోడ్లు, గల్లీలు అనే తేడాలేకుండా టపాసులు పేలుతుంటాయి. ఇలాంటి సమయంలో వాహనదారులు తమ వెహికల్స్ పార్కింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే.. అగ్నిప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. వాహనాలు కాలి బూడిదైనా ఆశ్చర్యం లేదు. అందుకే.. ఈ టిప్స్ పాటించండి.

కవర్డ్ పార్కింగ్ :మీ కారును పూర్తిగా కవర్​ చేసే షెడ్డు లాంటి ప్రాంతంలోనే నిత్యం పార్కింగ్ చేస్తున్నట్టైతే ఇబ్బంది లేదు. అలా కాకుండా.. ఓపెన్ ప్లేస్​లో పెడుతున్నట్టయితే.. పండగ ఒక్క రోజు ఇంటి రూఫ్​ కింద పెట్టే అవకాశం ఉంటే.. అక్కడ పార్క్ చేయండి.

దూరంగా :దీపావళి టపాసులు విక్రయిస్తున్న ప్రాంతాల పక్కనే మీరు నివసిస్తున్నట్టయితే.. మీ కారును ఆ దుకాణాలకు దగ్గరగా అస్సలే ఉంచకూడదు. పొరపాటున అగ్నిప్రమాదం చోటుచేసుకుంటే.. మీ కారు కూడా బూడిదయ్యే అవకాశం ఉంటుంది. అదేవిదంగా.. పిల్లలు టపాసులు పేల్చే ప్రాంతానికి కూడా దూరంగా మీ కారును పార్క్ చేయాల్సిందే.

హోండా, సిట్రోయెన్​ దీపావళి ఆఫర్స్​ - ఆ కారుపై ఏకంగా రూ.1,00,000 డిస్కౌంట్!

కారు పై కవర్ వేయకండి :కారును పార్క్ చేయగానే.. చాలా మంది దాని పైన కవర్ కప్పుతారు. అది మంచి పద్ధతే. కానీ.. దివాళీ టపాసులు మోగే సమయంలో కవర్ కప్పకపోవడమే మంచిది. నిప్పు రవ్వలు ఎగిరి వచ్చి కవర్​పై పడితే మంటలు వ్యాపించి కారు కాలిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కారు కవర్లన్నీ దాదాపుగా మండే లక్షణాలనే కలిగి ఉంటాయి.

పెయిడ్ పార్కింగ్ :మీ రెగ్యులర్ పార్కింగ్ స్థలం హై-రిస్క్ స్పాట్​గా భావిస్తే.. మీ ఇంటి లోపల కావాల్సినంత స్థలం లేకపోతే.. ఈ పండగ రెండు రోజులు మీకు తెలిసిన వారి స్థలం సేఫ్​ అనుకుంటే.. అక్కడ పార్క్ చేయడం మంచిది. అలాంటి చోటు లేదు అనుకుంటే.. పెయిడ్ పార్కింగ్ ప్రాంతంలో పార్క్ చేయండి. పార్కింగ్ ఫీజు గురించి చూసుకుంటే.. ఏదైనా జరగరాని ప్రమాదం జరిగితే.. కారు డ్యామేజ్​కు భారీగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.

ఫొటోలు తీసుకోండి : మీ కారును టపాసులు పేలుస్తున్న ప్రాంతంలో పార్క్ చేయడం తప్ప మరో మార్గం లేకపోతే.. ఎక్కడైతే పార్క్ చేస్తారో ఆ ప్రదేశంలో కారు పార్క్ చేసిన తర్వాత మీ వాహనాన్ని కొన్ని ఫొటోలు తీసి ఉంచుకోండి. ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగితే.. మీరు ఈ ఫొటోల ద్వారా ఎక్కడ కారుకు డ్యామేజ్ జరిగిందో చూసుకొని.. ఇన్సూరెన్స్ క్లైమ్ చేసుకునే అవకాశం ఉంటుంది.

సాధారణంగా.. టపాసులు పేలినప్పుడు నిప్పు రవ్వల ద్వారా వాహనాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. అలాగే కొంతమంది పిల్లలు సరదా కోసం ఉద్దేశపూర్వకంగానే వాహనాల కింద టపాసులు కాల్చడం చేస్తుంటారు. కాబట్టి.. మీరు సురక్షితమైన స్థలంలో మీ వాహనాలను పార్కింగ్ చేయడం ద్వారా.. జరగబోయే నష్టాన్ని ముందుగానే నివారించవచ్చు.

దీపావళిని ఐదు రోజుల పండగంటారు?-ఎందుకో తెలియాలంటే ఈ స్టోరీ చదవండి!

దీపావళి వేళ - మీ ఇంటి డెకరేషన్ కోసం సూపర్​ ఐడియాస్​!

ABOUT THE AUTHOR

...view details