తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సూపర్ బ్రదర్స్.. నడవలేని చెల్లిని డోలీలో మోస్తూ పరీక్షా కేంద్రానికి...

Brother carrying sister on doli: టీచర్​ కావాలన్న దివ్యాంగురాలైన సోదరి కల నెరవేర్చేందుకు అండగా నిలిచారు సోదరులు. తనంతట తాను నడవలేని చెల్లెలిని డోలీలో మోసుకెళ్లి పదో తరగతి పరీక్షలు రాయించారు. వారి వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. ఈ సంఘటన ఉత్తరాఖండ్​, పిథౌరాగఢ్​ జిల్లాలో జరిగింది.

Brother carrying sister on doli
సోదరిని డోలీలో పరీక్షా కేంద్రానికి తీసుకెళ్లిన సోదరులు

By

Published : Apr 2, 2022, 4:20 PM IST

Updated : Apr 2, 2022, 9:03 PM IST

సోదరిని డోలీలో పరీక్షా కేంద్రానికి తీసుకెళ్లిన సోదరులు

Brother carrying sister on doli: దివ్యాంగురాలైన సోదరి కల సాకారం చేసేందుకు అండగా నిలిచారు ఈ సోదరులు. పరీక్షలు రాసేందుకు తనంతట తాను వెళ్లలేని ఆ చెల్లిని.. డోలీలో కూర్చోబెట్టుకుని తమ భుజాలపై మోస్తూ సుమారు అర కిలోమీటర్ దూరంలోని పరీక్షా కేంద్రానికి చేర్చారు. పరీక్షలు జరిగినన్ని రోజులు డోలీలో చెల్లిని మోసుకెళ్తున్న సోదరుల వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. చెల్లి కోసం సోదరులు పడుతున్న కష్టాన్ని చూసి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఉత్తరాఖండ్​, పిథౌరాగఢ్​ జిల్లాలోని ​చమాలీ గ్రామానికి చెందిన సంజన దివ్యాంగురాలు. సోదరులు పరాస్​, ఆకాశ్, సోదరి సానియా​. తండ్రి గోవింద రాజన్​ ఆరేళ్ల క్రితం చనిపోయారు. తల్లి డంగ్రీ ప్రాంతంలోని ఓ ప్రాథమిక పాఠశాలలో వంట మనిషిగా పని చేస్తోంది. తండ్రి మరణం తర్వాత వారి కుటుంబ ఆర్థిక పరిస్థితి దిగజారిపోయింది. నిరుపేద కుటుంబానికి చెందిన సంజన.. బాగా చదువుకుని టీచర్​ కావాలనుకుంది. అందుకు తగినట్లుగానే చదువులో ఎప్పుడూ ముందుంటుంది. ప్రస్తుతం ఆమె 10వ తరగతి బోర్డు పరీక్షలు రాస్తోంది. వారి ఇంటి నుంచి పరీక్షా కేంద్రం శైలకుమారి ఇంటర్​ కళాశాల సుమారు 14 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దీంతో రోజూ పరీక్షా కేంద్రానికి వెళ్లలేని పరిస్థితిలో లోధియాగైర్​లో ఓ గదిని అద్దెకు తీసుకున్నారు. అక్కడి నుంచి కూడా సుమారు 0.5 కిలోమీటర్లు ప్రయాణించాలి.

నడవలేని సోదరిని డోలీలో రోజు అర కిలోమీటర్​ మోసుకెళ్లి పరీక్షలు రాయిస్తున్నారు సోదరులు. వారి వీడియో వైరల్​గా మారిన క్రమంలో జిల్లా పాలనాధికారి ఆశిశ్​ చౌహాన్ స్పందించారు. సంజన పరీక్షా కేంద్రాన్ని చమాలీలోని జీఐసీకి మార్చాలని ఆదేశించారు. ప్రభుత్వ పథకాల ద్వారా సాయం అందిస్తామని భరోసా కల్పించారు.

ఇదీ చూడండి:చీర సాయంతో వందలాది ప్రాణాలు కాపాడిన బామ్మ

Last Updated : Apr 2, 2022, 9:03 PM IST

ABOUT THE AUTHOR

...view details