జైలులో తనకు ఇష్టమైన పాట పెట్టాలని కోర్టుకు విన్నవించుకున్నాడో ఖైదీ. దీనిపై స్పందించిన న్యాయస్థానం.. అతడు అడిగిన పాట పెట్టాలని జైలు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. అయినా.. ఖైదీకి ఆ పాట వినే అవకాశమే రాలేదు.
కేరళ తిరువనంతపురంలోని పూజపుర సెంట్రల్ జైలులో గత కొంతకాలంగా శిక్ష అనుభవిస్తున్న ఓ ఖైదీకి జైలులో తనకు ఇష్టమైన పాటను వినాలన్నది కోరిక. ఇందుకోసం అధికారులకు విజ్ఞప్తి చేసేందుకు సిద్ధమయ్యాడు. 1980ల్లోని మలయాళ చిత్రం 'అంగడి'లోని 'కన్నుమ్ కన్నుమ్ తమ్మిల్ తమ్మిల్' అనే పాటను పెట్టాలంటూ ఓ లేఖ రాశాడు. అయితే.. ఆ లేఖను పొరపాటున జైలు అధికారులకు అందాల్సిన లెటర్ బాక్స్‌లో కాకుండా కంప్లైంట్ బాక్స్‌లో వేశాడు.