Jodhpur Dispute: రాజస్థాన్ జోధ్‌పుర్‌లో మంగళవారం రాత్రి రెండు వర్గాల మధ్య భీకర ఘర్షణ చెలరేగింది. ఇద్దరు యువకుల మధ్య మొదలైన గొడవ.. పెద్దగా మారి రెండు వర్గాలు నడిరోడ్డుపైనే బాహాబాహీకి దిగాయి. ఇరు వర్గాలకు చెందిన యువకులు పరస్పరం దాడి చేసుకున్నారు. పిడుగిద్దుల వర్షం కురిపించుకున్నారు. ఈ ఘటనలో పలువురికి గాయాలైనట్లు తెలుస్తోంది. ఓ యువకుడ్ని ఆస్పత్రికి కూడా తరలించినట్లు సమాచారం. సూర్సగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపు చేశారు. రెండు వర్గాలను చెదరగొట్టారు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు.
జోధ్‌పుర్‌లో రెండు వర్గాల మధ్య ఘర్షణ.. భారీగా పోలీసుల మోహరింపు - Rajasthan hindi news
Jodhpur fight: రాజస్థాన్ జోధ్‌పుర్‌లో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఇరు పక్షాలు నడిరోడ్డుపైనే పరస్పరం దాడి చేసుకున్నాయి. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు యువకులను చెదరగొట్టారు. ఆ ప్రాంతంలో భారీగా బలగాలను మోహరించారు.
జోధ్‌పుర్‌లో రెండు వర్గాల మధ్య ఘర్షణ.
అనంతరం ఆ ప్రాంతంలో 144 సెక్షన్ విధించారు అధికారులు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా బలగాలను మోహరించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని చెప్పారు. ఓ స్థానిక యువకుడు ట్యాక్సీ డ్రైవర్‌తో గొడవపడ్డాడని, అది కాస్త పెద్దగా మారి రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారి తీసిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఘటన గురించి తెలిశాక భాజపా, కాంగ్రెస్ శ్రేణులు కూడా అక్కడకు చేరుకున్నట్లు తెలుస్తోంది.