తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఎలుకల సాయంతో ఇల్లు కొట్టేసే కుట్ర!'.. పక్కింటి వ్యక్తిపై పోలీసులకు వృద్ధుడి ఫిర్యాదు - ఎలుక ఇబ్బంది పెడుతున్నాయని పోలీసులకు ఫిర్యాదు

ఛత్తీస్​గఢ్​లో ఓ వింత ఘటన జరిగింది. ఎలుకల వివాదం పోలీస్ స్టేషన్​కు చేరింది. పక్కింటి వ్యక్తి తన ఇంటి గోడ పక్కన ధాన్యం నిల్వ చేయడం వల్ల ఎలుకలు ఎక్కువగా వస్తున్నాయని ఓ వృద్ధుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎలుకల వల్ల తన ఇల్లు కూలే స్థితికి చేరుకుందని ఆందోళన వ్యక్తం చేశాడు.

dispute between neighbours in rat issue
ఇరుగుపొరుగు వారి మధ్య ఎలుక వివాదం

By

Published : Dec 20, 2022, 1:33 PM IST

ఎలుకలు కారణంగా ఇరుగుపొరుగువారు గొడవపడి, పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేసిన ఘటన ఛత్తీస్​గఢ్​లోని బలోద్​లో జరిగింది. పక్కింటి వ్యాపారి గోడ దగ్గర ధాన్యం బస్తాలు పెట్టడం వల్ల తమ ఇంటి గోడ పూర్తిగా దెబ్బతిందని బిసాహు రామ్ టాండన్(70) అనే వృద్ధుడు పోలీస్ స్టేషన్​లో కేసు పెట్టాడు.

పోలీసుల వివరాల ప్రకారం..బిసాహు రామ్ టాండన్ అనే వృద్ధుడు, యువరాజ్ మార్కండే అనే చిరువ్యాపారి పక్కపక్క ఇళ్లలో నివసిస్తున్నారు. రామ్ టాండన్ ఇంటి గోడను ఆనుకుని ఉన్న స్థలంలో యువరాజ్ ధాన్యం బస్తాలను పెట్టాడు. దీంతో అక్కడికి ఎలుకలు భారీగా వస్తున్నాయి. ఆ ఎలుకలు తన ఇంటిని, వస్తువులను నాశనం చేస్తున్నాయని రామ్ టాండన్ కలెక్టర్​ ఆఫీసులో యువరాజ్ మార్కండేపై ఫిర్యాదు చేశాడు. ఈ కేసును గుండర్​దేహి పోలీస్ స్టేషన్​కు సిఫార్సు చేశారు కలెక్టర్ ఆఫీస్ అధికారులు. ఈ కేసు విషయమై ఫిర్యాదుదారుడు, వ్యాపారి పోలీస్ స్టేషన్​కు వెళ్లారు.

'మాకు పిల్లలు లేరు. ప్రభుత్వం ఇచ్చిన పింఛన్​తోనే నేను, నా భార్య జీవనం సాగిస్తున్నాం. కొన్నాళ్ల నుంచి మా ఆరోగ్యం క్షీణిస్తోంది. మాకు ఎటువంటి ఆదాయ మార్గాలు లేవు. పక్కింటివారు మా ఇంటి గోడ పక్కన ధాన్యం బస్తాలు పెట్టడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఎలుకలు వల్ల మా ఇల్లు బాగా దెబ్బతింది.. ఎప్పుడైనా కూలిపోవచ్చు. ఈ వివాదంపై గ్రామంలో పలుమార్లు పంచాయితీ పెట్టినా ప్రయోజనం లేకపోయింది. నా ఇంటిని స్వాధీనం చేసుకునేందుకు వ్యాపారి యువరాజ్ ప్రయత్నిస్తున్నాడు'

--రామ్ టాండన్, ఫిర్యాదుదారుడు

వృద్ధుడు రామ్ టాండన్​ వ్యాఖ్యలను వ్యాపారి యువరాజ్ మార్కండే ఖండించాడు. నాపై వృద్ధుడు రామ్ టాండన్ చేసిన ఆరోపణలు తప్పని అన్నాడు. తానొక చిన్న వ్యాపారినని.. 15 బస్తాల దాన్యాన్ని ఇంట్లో నిల్వ చేసుకుంటానని తెలిపాడు. ఎలుకలు వృద్ధుడి ఇంట్లోకి ప్రవేశిస్తే అది నా తప్పా.. ఆ ఎలుకలు ఎక్కడి నుంచి వచ్చాయో నాకేం తెలుసని పోలీసులకు చెప్పాడు.

'అసలు ఆ ఎలుకలు నావి అని ఎలా చెబుతాడు. ఏవైనా సాక్ష్యాలు ఉన్నాయా? నేను ఎలుకలను పెంచట్లేదు. అవి ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు. వాటిని పొరుగింటికి వెళ్లకుండా నేను ఎలా అదుపు చేయగలను. ఎలుకలు నా మాట వింటే వృద్ధుడి ఇంటిని నాశనం చెయ్యొద్దని చెబుతా.'

--యువరాజ్ మార్కండే, వ్యాపారి

ABOUT THE AUTHOR

...view details