అన్నదాతల ఆందోళనలకు సంబంధించిన 'టూల్కిట్' వ్యవహారంలో అరెస్టయిన పర్యావరణ ఉద్యమకారిణి దిశ రవి.. తిహార్ జైలు నుంచి విడుదలయ్యారు.
ఈ కేసుకు సంబంధించి పోలీసులు సమర్పించిన ఆధారాలు నమ్మశక్యంగా లేవన్న దిల్లీ కోర్టు.. దిశ రవికి అంతకుముందు బెయిల్ మంజూరు చేస్తూ దిల్లీ పటియాలా హౌస్ కోర్టు తీర్పు వెలువరించింది. ఈ నేపథ్యంలో.. మంగళవారం రాత్రి సమయంలో ఆమె బయటకి వచ్చారు.
జనవరి 26న రైతుల ఉద్యమాన్ని తీవ్రతరం చేయడానికి సంబంధించి ఓ కార్యాచరణను ఈ టూల్‌కిట్‌లో పొందుపర్చారనే ఆరోపణలతో దిశ రవిని ఫిబ్రవరి 13 న పోలీసులు బెంగళూరులో అరెస్ట్ చేశారు