తూర్పు లద్దాఖ్‌లోని పాంగాంగ్ సరస్సు ఉత్తర, దక్షిణ భాగాల్లో భారత్-చైనా బలగాల ఉపసంహరణ ప్రక్రియ ప్రణాళికపరంగా సాగుతోందని సైనిక వర్గాలు వెల్లడించాయి. మరో 6-7 రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తిస్థాయిలో ముగుస్తుందని భావిస్తున్నట్టు పేర్కొన్నాయి.
పాంగాంగ్ సరస్సు ఉత్తర ప్రాంతం నుంచి పీఎల్ఏ(చైనా లిబరేషన్ ఆర్మీ) ఇప్పటికే.. బంకర్లు, తాత్కాలిక పోస్టులు, ఇతర నిర్మాణాలను తొలగించిందని.. సైనిక బలగాన్ని కూడా నెమ్మదిగా తగ్గించుకుంటోందని సైనిక వర్గాలు స్పష్టం చేశాయి.
పాంగాంగ్ సరస్సులో బలగాల ఉపసంహరణ బలగాల ఉపసంహరణ ప్రక్రియను ముమ్మరం చేసేందుకు క్షేత్రస్థాయిలోని కమాండర్లు రోజువారీగా సమావేశమవుతున్నారని అధికారులు వెల్లడించారు.
చైనా దూకుడుతో గతేడాది మే నుంచి ఇరు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణ నెలకొంది. జూన్‌లో గల్వాన్ లోయలో భారత్-చైనా సైనికుల మధ్య భారీ స్థాయిలో ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో పరిస్థితులను సరిచేసేందుకు ఇరు దేశాల అధికారులు అప్పటి నుంచి చర్చలు జరుపుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో.. ఇరు దేశాలు పాంగాంగ్ సరస్సులో బలగాల ఉపసంహరణ ప్రక్రియను మొదలుపెట్టినట్టు గత గురువారం పార్లమెంట్ వేదికగా రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకటించారు.
ఇదీ చూడండి:-బలగాల ఉపసంహరణ: చైనా ఉచ్చులో భారత్?