తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పాంగాంగ్​ వెంబడి బలగాల ఉపసంహరణ పూర్తి - Disengagement has been fully completed along the Southern and Northern bank of Pangong lake. Post-disengagement

భారత్‌-చైనా సరిహద్దులో ప్రతిష్టంభనకు తెరదించే ప్రక్రియలో కీలక ప్రకటన శుక్రవారం వెలువడింది. పాంగాంగ్​ సరస్సు ఉత్తర, దక్షిణ తీరాల్లో బలగాల ఉపసంహరణ పూర్తైందని భారత ఆర్మీ వర్గాలు తెలిపాయి.

Disengagement has been fully completed along the Southern and Northern bank of Pangong lake. Post-disengagement, Indian troops have moved to their depth locations: Indian Army sources
పాంగాంగ్​ వెంబడి పూర్తైన బలగాల ఉపసంహరణ

By

Published : Feb 19, 2021, 4:38 PM IST

Updated : Feb 19, 2021, 5:09 PM IST

పాంగాంగ్​ సరస్సు దక్షిణ, ఉత్తర సరస్సులో బలగాల ఉపసంహరణ ప్రక్రియ పూర్తైంది. భారత దళాలు తమ స్థావరాలకు చేరుకున్నాయి. ఈ మేరకు భారత సైనిక వర్గాలు శుక్రవారం తెలిపాయి.

మరోసారి సమావేశం..

భారత్-చైనా మధ్య వాస్తవాధీన రేఖ వద్ద చెలరేగిన వివాదాలను పరిష్కరించుకొనేందుకు మరోసారి సమావేశం కానున్నాయి. శనివారం ఉదయం 10 గంటలకు చైనా భూభాగంలోని మాల్దో పోస్టు వద్ద ఈ సమావేశం జరగనుంది.

శనివారం జరగనున్న కమాండర్​ స్థాయి సమావేశంలో తూర్పు లద్దాఖ్​లోని గోగ్రా, హాట్​స్ప్రింగ్స్​, దెప్సాంగ్​ ప్రాంతాల్లో సైనిక బలగాల ఉపసంహరణపై ఇరు దేశాలు ప్రధానంగా చర్చించనున్నాయి. ఈ మేరకు భారత ఆర్మీ వర్గాలు తెలిపాయి.

పాంగాంగ్​ ఉత్తర, దక్షిణ తీరాల్లో పూర్తైన బలగాల ఉపసంహరణ ప్రక్రియను సమీక్షించడంతో పాటు మిగిలిన ప్రదేశాల్లో వివాదాలపై కూడా చర్చించనున్నారు.

Last Updated : Feb 19, 2021, 5:09 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details