చైనాతో ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడాలంటే సరిహద్దులో ప్రశాంత వాతావరణం నెలకొంటేనే సాధ్యమవుతుందని భారత్ మరోమారు తేల్చిచెప్పింది. తూర్పు లద్దాఖ్‌లో అన్ని ఫ్రిక్షన్ పాయింట్ల నుంచి బలగాలను ఉపసంహరించుకుంటేనే ఇరు దేశాల దళాల మధ్య ఉద్రిక్తతలు తగ్గుతాయని నొక్కిచెప్పింది. సమస్యను పరిష్కరించేలా రెండు దేశాలు తమ అభిప్రాయాలను పంచుకునేందుకు ఓ వేదికను ఏర్పాటు చేయాలని ఇప్పటికే నిర్ణయించాయి.
సరిహద్దులో ఉద్రిక్తతలు తగ్గించేందుకు గతవారం తూర్పు లద్దాఖ్‌లోని పాంగాంగ్ సరస్సు ఉత్తర, దక్షిణ ప్రాంతాల నుంచి బలగాలు, ఆయుధాలను ఉపసంహరించుకున్నాయి భారత్, చైనా. ఈ నేపథ్యంలో చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యీతో భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జై శంకర్ గురువారం 75 నిమిషాల పాటు ఫోన్లో మాట్లాడారు. ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఇరు దేశాల మధ్య సరిహద్దు సమస్యను పరిష్కరించేందుకు ఇంకా సమయం పడుతుందని తెలిపారు. కానీ సరిహద్దులో ఘర్షణలు, ఉద్రిక్త వాతావరణం కారణంగా రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత దెబ్బతింటాయని స్పష్టం చేశారు. వాస్తవాధీన రేఖ వెంబడి పరిస్థితిపైనా ఫోన్లో చర్చించినట్లు పేర్కొన్నారు.
శాంతి స్థాపనే లక్ష్యం..