తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'బలగాల ఉపసంహరణతో భారత్​కే నష్టం!'

తూర్పు లద్దాఖ్​లోని గల్వాన్ లోయలో గతేడాది జరిగిన ఘర్షణల్లో వీరమరణం పొందిన సైనికులకు నివాళులర్పించారు కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా గాంధీ. బలగాల ఉపసంహణతో భారత్​కు నష్టం జరిగినట్లు కనిపిస్తోందని విమర్శించారు.

congress chief
సోనియా

By

Published : Jun 15, 2021, 3:54 PM IST

Updated : Jun 15, 2021, 4:33 PM IST

తూర్పు లద్దాఖ్​లో బలగాల ఉపసంహరణపై చైనాతో కుదిరిన ఒప్పందం భారత్​కు నష్టదాయకంగా కనిపిస్తోందని అన్నారు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ. గల్వాన్​ ఘర్షణకు ఏడాది పూర్తయిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. చైనాతో సరిహద్దుల్లో 2020 ఏప్రిల్​కు ముందు నాటి స్థితిని పునరుద్ధరించడంలో భారత్​ ఎలాంటి పురోగతి సాధించిందని కేంద్రాన్ని ఇప్పటికే అనేకసార్లు ప్రశ్నించామని గుర్తు చేశారు సోనియా.

సరిహద్దుల్లోని గల్వాన్ ఘటన జరిగిన పరిస్థితుల గురించి ప్రభుత్వం వివరించి.. జవాన్ల త్యాగం వృథా కాలేదని భరోసా ఇస్తుందని కాంగ్రెస్​ ఎదురుచూసిందని సోనియా తెలిపారు. అయితే మోదీ ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదన్నారు. సరిహద్దుల్లో అమరవీరుల త్యాగాలు వృథా కాలేదనే విశ్వాసాన్ని దేశ ప్రజల్లో నింపాలని ప్రభుత్వాన్ని కోరారు సోనియా​.

గతేడాది జూన్​ 15న తూర్పు లద్దాఖ్​లోని గల్వాన్​ లోయలో భారత్​-చైనా బలగాల మధ్య జరిగిన ఘర్షణలో 20 మంది సైనికులు అమరులయ్యారు. ఈ ఘటనకు నేటికి ఏడాది అయిన సందర్భంగా వారి త్యాగాలను స్మరించుకుంటూ.. అమరవీరులకు కాంగ్రెస్​ అధ్యక్షురాలు నివాళులర్పించారు.

ఇదీ చూడండి:Galwan: అమర వీరులకు సైన్యం నివాళి

Last Updated : Jun 15, 2021, 4:33 PM IST

ABOUT THE AUTHOR

...view details