ఉన్నత పాఠశాలలు, కళాశాల పాఠ్యాంశాల్లో విపత్తు(Disaster), మహమ్మారి(Pandemic) నిర్వహణను చేర్చాలని ఒడిశా ప్రభుత్వం శనివారం నిర్ణయించింది. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అధ్యక్షతన జరిగిన మంత్రి మండలి సమావేశంలో సదరు తీర్మానాన్ని ఆమోదించారు.
'పాఠ్యాంశంగా విపత్తు, మహమ్మారి నిర్వహణ' - నవీన్ పట్నాయక్
విపత్తు(Disaster), మహమ్మారి(Pandemic) నిర్వహణను ఉన్నత పాఠశాలలు, కళాశాల పాఠ్యాంశాల్లో చేర్చాలని ఒడిశా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఓ తీర్మానాన్ని తయారు చేసి మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
విపత్తు, మహమ్మారి నిర్వహణ
తరచూ తుపానులు, మహమ్మారి(Pandemic) వంటి విపత్తుల(Disaster) వల్ల ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండాలని మంత్రి మండలి తెలిపింది. "ఒకప్పుడు విపత్తుల వల్ల ఒడిశా తీవ్రంగా నష్టపోయింది. విపత్తును సమర్థంగా ఎదుర్కోలేకపోయింది. కానీ నేడు, విపత్తు నిర్వహణలో ఒడిశా విధానం ప్రపంచ ప్రశంసలను పొందుతోంది" అని తీర్మానంలో పేర్కొన్నారు.
ఇదీ చదవండి:ఒడిశా, బంగాల్ రాష్ట్రాల్లో 'యాస్' బీభత్సం
Last Updated : May 30, 2021, 11:30 AM IST