Tamil director Bhagyaraj on Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోదీని విమర్శించేవారు పరిపక్వత లేనివారై ఉంటారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ప్రముఖ దర్శకుడు భాగ్యరాజ్. చెన్నై, త్యాగరాయనగర్లోని భాజపా ప్రధాన కార్యాలయంలో బుధవారం(ఏప్రిల్ 20) 'ప్రధానమంత్రి ప్రజా సంక్షేమ పథకాలు- నవ భారత్' అనే పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన తమిళ డైరెక్టర్ భాగ్యరాజ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
" నేను బెంగళూరు వెళ్లినప్పుడు అక్కడి ప్రజలు ఐపీఎస్ అధికారి అన్నామలై(ప్రస్తుతం తమిళనాడు భాజపా అధ్యక్షుడు)పై ప్రశంసలు కురిపించారు. తమిళనాడు భాజపా నాయకుడిగా సరైన వ్యక్తిని నియమించారని చెప్పారు. కొందరు విమర్శకులు సరైన రీతిలో మాట్లాడరు, ఎదుటివారు చెప్పేది వినరు. అలాంటి విమర్శకులు తమను తాము పరిపక్వత లేనివారుగా భావించాలి."
- భాగ్యరాజ్, ప్రముఖ దర్శకుడు.