తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రాజు పటేల్.. భారత దేశపు తొలి 'డిజిటల్ బెగ్గర్​'!

Digital beggar of India: మెడలో క్యూఆర్​ కోడ్​ బోర్డ్​.. పక్కనే ఓ స్పీకర్.. చేతిలో ట్యాబ్.. బిహార్​లోని ఓ యాచకుడి అవతారం ఇది. అందుకే అతడు దేశంలోనే తొలి డిజిటల్ బెగ్గర్​గా గుర్తింపు పొందాడు. ఇంతకీ ఎవరతడు? ఏం చేస్తున్నాడు?

digital beggar
digital beggar

By

Published : Feb 8, 2022, 7:41 PM IST

Updated : Feb 9, 2022, 9:50 AM IST

భారత దేశపు తొలి 'డిజిటల్ బెగ్గర్​'!

Digital beggar of India బిహార్​ బేతియాకు చెందిన ఓ యాచకుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ప్రజలు దానంగా ఇచ్చే డబ్బును ఫోన్​పే ద్వారా స్వీకరిస్తూ.. భారత దేశపు మొదటి 'డిజిటల్ బెగ్గర్'గా సోషల్​ మీడియాలో గుర్తింపు పొందాడు.

డిజిటల్ బెగ్గర్ రాజు పటేల్

Bihar digital beggar

రాజు పటేల్.. బిహార్​ బేతియాలో ఎప్పటి నుంచో భిక్షాటన చేస్తూ జీవితం గడుపుతున్నాడు. అయితే.. ఇటీవల చాలా మంది అతడికి డబ్బులు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారు. సాయం చేయాలని బతిమలాడినా చిల్లర లేదంటూ వెళ్లిపోతున్నారు. విసిగిపోయిన రాజు పటేల్.. డిజిటల్ బాట పట్టాడు. ఈ-వాలెట్​లో ఖాతా తెరిచి, మెడలో క్యూఆర్​ కోడ్​ ఉన్న బోర్డు వేసుకుని యాచించడం మొదలుపెట్టాడు. ఎప్పుడూ తనతోనే ఓ ట్యాబ్​ కూడా పెట్టుకుని.. బ్యాంకు బ్యాలెన్స్​ను చెక్​ చేసుకుంటున్నాడు.

ఫోన్​లో ట్యాబ్​తో డిజిటల్ బెగ్గర్
క్యూఆర్ కోడ్​ను స్కాన్ చేస్తూ..

Raju patel digital beggar

డిజిటల్ బెగ్గర్​గా మారే ముందు రాజు పటేల్ పెద్ద కసరత్తే చేశాడు. ఖాతా కోసం బ్యాంకుకు వెళ్లాడు. వాళ్లు ఆధార్, పాన్​ కార్డు తప్పనిసరిగా ఉండాలని చెప్పారు. పాన్​ కార్డుకు దరఖాస్తు చేసి, అది వచ్చాక బేతియాలోని స్టేట్ బ్యాంక్​లో ఖాతా తెరిచాడు. ఫోన్​పేతో అనుసంధానించాడు. ఇప్పుడు రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, కాళీ భాగ్ ఆలయం వద్ద తిరుగుతూ యాచిస్తున్నాడు. ఇతడి డిజిటల్ అవతారం చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. చాలా మంది ఫోన్​పే ద్వారా రూ.10-20 బిచ్చం వేస్తున్నారు.

క్యూఆర్ కోడ్​ను స్కాన్ చేస్తూ..
డబ్బులు పంపి రాజు పటేల్​​కు చూపిస్తున్న వ్యక్తి

లాలూ ఫ్యాన్​.. ఫ్రీ పాస్

ఆర్​జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ సభలు, కార్యక్రమాలు అన్నింటికీ హాజరయ్యేవాడు రాజు పటేల్. ఒకసారి లాలూను నేరుగా కలిసి, తన బాధలు చెప్పుకున్నాడు. 2005లో రైల్వే మంత్రిగా ఉన్న లాలూ.. రాజుకు ఫుడ్​ పాస్​ ఇప్పించారు. అది చూపిస్తే సప్తక్రాంతి సూపర్​ఫాస్ట్ ఎక్స్​ప్రెస్​లో ఉచితంగా భోజనం పెట్టేవారు. అలా రోజూ కడుపు నింపుకునేవాడు రాజు. కానీ.. రైల్వే మంత్రి మారాక ఆ పాస్​ రద్దయిపోయింది. చివరకు రాజు ఇలా డిజిటల్ బెగ్గర్​ అవతారం ఎత్తాడు.

ఇదీ చదవండి:జన్​ధన్​ ఖాతాలోకి రూ.15లక్షలు.. మోదీ ఇచ్చారనుకుని ఇల్లు నిర్మాణం.. కానీ...

Last Updated : Feb 9, 2022, 9:50 AM IST

ABOUT THE AUTHOR

...view details