DIG Press conference at Rajahmundry Central Jail: తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆరోగ్యంపై... రాజమండ్రి సెంట్రల్ జైల్ ఆవరణలో ప్రభుత్వ వైద్యులు, జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్... మీడియా సమావేశం నిర్వహించారు. ప్రస్తుతానికి చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. చంద్రబాబును చల్లగా ఉండే ప్రదేశంలో ఉంచాలని వైద్యులు సూచించించారు. ఆయనకు చల్లని వాతావరణం అవసరమని ప్రభుత్వ వైద్యులు పేర్కొన్నారు. గతంలో ఉన్న ఆరోగ్య సమస్యలు ఏమిటో తమకు తెలియదని వైద్యులు తెలిపారు. చంద్రబాబుకు స్టెరాయిడ్స్ ఇవ్వడం లేదని పేర్కొన్నారు. చంద్రబాబు వేసుకున్న మందులను మాకు చూపించారని.. వాడే మందులు చూశాకే మిగతా మందులు సూచించినట్లు వైద్యులు వెల్లడించారు.
జైలులో ఏసీలు పెట్టేందుకు ప్రిజన్ రూల్స్ ఒప్పుకోవు:నిన్న వైద్యులు ఇచ్చిన నివేదికను కోర్టుకు పంపించినట్లు పోలీసు అధికారులు తెలిపారు.ఇవాళ్టి వైద్యుల నివేదికనూ కోర్టుకు వెంటనే పంపిస్తామని పోలీసులు వెల్లడించారు. చంద్రబాబు లాంటి ప్రముఖ వ్యక్తి విషయంలో జాగ్రత్తగా ఉంటామని డీఐజీ రవికిరణ్ పేర్కొన్నారు. చంద్రబాబు ఆహార అలవాట్లు ఏమిటో వైద్యులు తెలుసుకున్నారని అందుకు తగినట్లు వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. వ్యక్తిగత వైద్యుడి సలహాతో మందులు వాడతానని చంద్రబాబు చెప్పారని పేర్కొన్నారు. జైలులో ఏసీలు పెట్టేందుకు ప్రిజన్ రూల్స్ ఒప్పుకోవని జైలు అధికారులు తెలిపారు. ప్రత్యేక కేసుగా పరిగణించి కోర్టు ఆదేశిస్తే అప్పుడు చూస్తామని పేర్కొన్నారు. ములాఖత్ సమయం వచ్చిన ఆరోపణలపై ఆయన వివరణ ఇచ్చారు. ములాఖత్ పూర్తయ్యిందని గుర్తుచేయడం తమ బాధ్యత అనీ... తాము ఎవరితోనూ దురుసుగా ప్రవర్తించదని, పోలీసు వెల్లడించారు.