తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కుమారుడికి టీకా కోసం కాలినడకన 6 కిలోమీటర్లు..

దివ్యాంగుడైన కుమారుడికి టీకా ఇప్పించేందుకు ఆ తల్లిదండ్రులు 6 కిలోమీటర్లు కాలినడకన ప్రయాణించారు. కుమారుడిని వీల్​ఛైర్​పై ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఈ ఘటన ఝార్ఖండ్​లోని రాంచీలో జరిగింది. ఈటీవీ భారత్ సమాచారంతో స్పందించిన అధికారులు.. దివ్యాంగుడైన అర్జున్​కు వీలైనంత త్వరగా టీకా అందించాలని ఆదేశించారు. వ్యాక్సిన్​ అందించిన సిబ్బంది.. అర్జున్​, అతడి కుటుంబ సభ్యులు ఇంటికి చేరుకునేందుకు వాహనం ఏర్పాటు చేశారు.

Vaccine for disabled son, దివ్యాంగుడికి కరోనా టీకా రాంచీ
కుమారుడికి టీకా కోసం కాలినడకన 6 కిలోమీటర్లు..

By

Published : Jul 26, 2021, 1:22 PM IST

కుమారుడికి టీకా కోసం 6 కిలోమీటర్లు నడిచిన తల్లిదండ్రులు

ఝార్ఖండ్​ రాంచీలోని విద్యానగర్​కు చెందిన తరుణ్​.. దివ్యాంగుడైన తన 31 ఏళ్ల కుమారుడికి టీకా వేయించాలని నిశ్చయించుకున్నాడు. స్థానికంగా.. ఆదివారం వారాంతపు లాక్​డౌన్​ అమలులో ఉండటం వల్ల వారికి వాహనాలు కూడా అందుబాటు లేవు. ఏది ఏమైనా అర్జున్​కు టీకా ఇప్పించాల్సిందే అని పట్టుదలతో ఉన్న ఆ తండ్రి.. అతడిని వీల్​ఛైర్​లో కూర్చోబెట్టి, తన భార్య అల్బాదేవితో కలిసి ఆసుపత్రికి నడక ప్రారంభించాడు. ఇలా 6 కిలోమీటర్లు అర్జున్​ను వీల్​ఛైర్​పై తోస్తూ.. కాలినడకన అక్కడున్న ప్రభుత్వాసుపత్రికి చేరుకున్నారు.

స్పందించని సిబ్బంది..

తరుణ్​ దంపతులు తమ కుమారుడితో అంతదూరం నుంచి ఆసుపత్రికి చేరుకున్నారు కానీ.. వారిని పట్టించుకున్న వారే లేరు. వ్యాక్సిన్​ రెజిస్ట్రేషన్​ కౌంటర్​ వద్ద రద్దీగా ఉండటం వల్ల కొన్ని గంటల పాటు వారు ఆ ఆసుపత్రి ఆవరణలోనే పడిగాపులు పడ్డారు. కుమారుడికి సాయంగా ఒకరు ఉండి.. వంతులు వారీగా క్యూలో నిల్చోసాగారు.

ఈటీవీ భారత్​ చొరవ..

తరుణ్​ స్థితిని గమనించిన ఈటీవీ భారత్​.. ఆరా తీయగా తమ వివరాలను వెల్లడించాడు. దీంతో ఈటీవీ భారత్ చొరవ తీసుకుని​ అధికారులకు సమాచారం అందించింది. దీనిపై స్పందించిన అధికారులు.. అర్జున్​కు వీలైంత త్వరగా వ్యాక్సిన్​ అందించాలని ఆసుపత్రి సిబ్బందిని ఆదేశించారు. అర్జున్​కు వ్యాక్సిన్​ అందించిన సిబ్బంది.. వారు ఇంటికి చేరుకునేందుకు అంబులెన్సును ఏర్పాటు చేశారు.

ఇదీ చదవండి :చక్రాసనంలో 30 కేజీల బరువు మోసి రికార్డు

ABOUT THE AUTHOR

...view details