వారు మీకోసం దోశలు వేస్తారు... మీ బట్టలు ఉతుకుతారు... మీ కోసం గ్లౌజులు వేసుకొని బాక్సింగ్ కూడా చేస్తారు. మీ ఓటు పొందేందుకు రాజకీయ నాయకులు ఏంచేయడానికైనా వెనుకాడరు.
ముఖ్యంగా.. తమిళనాడులో ఎన్నికల సమయంలో నేతల విన్యాసాలు ప్రజలను ఆశ్చర్యపరుస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి.. మరి కొద్ది రోజుల మాత్రమే గడువు ఉండటంతో తమిళనాడులో అన్ని పార్టీల నేతలు ప్రచార జోరు పెంచారు. ప్రచారంలో భాగంగా.. కొందరు అభ్యర్థులు ఓటర్ల ఇంటికి వెళ్లి బట్టలు ఉతకడం, ఇస్త్రీ చేయడం.. పిల్లలకు స్నానాలు చేయించడం, కురగాయలు అమ్మడం, పెద్దల కాళ్లు కడగడం వంటివి చేస్తున్నారు.
దోశలు వేసిన డీఎంకే నేత..
ఒక వ్యక్తి మనస్సు గెలవాలంటే.. అతడి కడుపును సంతృప్తి పరచాలని పెద్దలు అంటారు. అందుకేనేమో.. చెన్నైలోని విరుంగబాక్కం స్థానానికి చెందిన డీఎంకే అభ్యర్థి ప్రభాకర్ రాజా దోశలు వేశారు.
దోశ వేస్తున్న డీఎంకే అభ్యర్థి ప్రభాకర్ రాజా దోశ వేస్తున్న డీఎంకే అభ్యర్థి ప్రభాకర్ రాజా దోశ వేస్తున్న డీఎంకే అభ్యర్థి ప్రభాకర్ రాజా బట్టలు ఉతికిన అన్నాడీఎంకే అభ్యర్థి..
నాగపట్టిణం అన్నాడీఎంకే అభ్యర్థి కతివరన్ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తుండగా ఓ మహిళ బట్టలు ఉతుకుతూ కనిపించింది. ఇంకేముంది.. వెంటనే ఈయన రంగంలోకి దిగి బట్టలు ఉతికేశారు.
బట్టలు ఉతుకుతున్న అన్నాడీఎంకే అభ్యర్థి బాక్సింగ్ చేసిన మరో నేత..
చెన్నైలోని తిరువోత్తియర్ స్థానం నుంచి బరిలో ఉన్న డీఎంకే అభ్యర్థి కేపీ శంకర్ ఏకంగా బాక్సింగ్ చేశారు. ఎదుట ఉన్న వ్యక్తి ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి అనుకొని పంచ్‌లు విసిరారు.
కోలీవుడ్ నటుడి హంగామా..
ఏమైనా సినిమా వాళ్లు ఎన్నికల బరిలో ఉంటే.. ఆ హంగామా వేరుగా ఉంటుంది. తొండముత్తూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న కోలీవుడ్ నటుడు మన్సూర్ అలీ ఖాన్ విభిన్నంగా ప్రచారం నిర్వహిస్తూ.. ఓటర్ల దృష్టిని తనవైపుకు తిప్పుకుంటున్నారు. పెన్ను పేపర్ చేతబట్టి ప్రజల సమస్యలు రాసుకుంటున్నారు. ఏకంగా చెత్త కుప్ప వద్ద కూర్చొని మరీ ప్రచారం నిర్వహిస్తున్నారు.
అభిమానుల ఫీట్లు..
అభ్యర్థుల సంగతే ఇలా ఉంటే వారి మద్దతుదారుల గురించే చెప్పనవసరం లేదు. సందట్లో సడేమియాలా వారు చేసే హడావుడి మాములుగా ఉండదు. ఆర్ఎస్ పురం స్థానంలో ప్రచారంలో భాగంగా.. అన్నాడీఎంకే అభ్యర్థి, రాష్ట్ర మంత్రి ఎస్‌పీ వేలుమణికి మద్దతుగా ఓ యోగా టీచర్ తలకిందులుగా నడుస్తూ నడుము, కారుకు మధ్య చైను కట్టుకుని ఆ వాహనాన్ని లాగాడు. దీని వల్ల తన అభిమాన నేతకు ప్రచారంతో పాటు యోగాపై కూడా ప్రజల్లో అవగాహన కల్పించవచ్చని చెప్పాడు.
ఇలా ఎన్నెన్నో వింతలు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మనకు దర్శనమిస్తున్నాయి. కొందరు కబడ్డీ ఆడితే.. మరి కొందరు డమరుకం వాయిస్తూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. ఇంకొకరైతే ఏకంగా బ్యాట్స్‌మన్ వేషం వేసి సమస్యలను బాదేస్తా అని వీధుల్లో తిరుగుతున్నారు.
ఇదీ చూడండి:బంగాల్, అసోంలో తొలి దశ ప్రచారం సమాప్తం