Different Holi Celebration In Karnataka: హోలీ పండుగ సందర్భంగా రతీమన్మథుల వేషధారణలు సందడి చేస్తాయి. అయితే.. రతీమన్మథులను కొన్నిచొట్ల చెక్కతో చేస్తే, మరికొన్ని చోట్ల వస్త్రం లేదా వరి గడ్డితో తయారు చేస్తారు. కర్ణాటకలోని హవేరీ జిల్లాలో మాత్రం కొన్నేళ్లుగా భిన్నమైన హోలీ వేడుకలు జరుగుతున్నాయి. లివింగ్ రతి-మన్మథులతో వేడుక నిర్వహిస్తారు. వారిని నవ్వించాలని ప్రజలకు సవాల్ విసురుతారు.
ఎవరైనా ఇద్దరిని ఎంపిక చేసి రతీమన్మథులుగా అలంకరిస్తారు. వేదికపై ఒకే దగ్గర కూర్చోబెడతారు. రతి-మన్మథ జంటను నవ్వించే వారికి కొంత బహుమానం కూడా ఇస్తారు. ఎవరైనా ముందుకు వచ్చి ఆ జంటను నవ్వించవచ్చు. ఇందుకోసం సినిమా డైలాగ్‌లు, మిమిక్రీ, పాటలు.. ఇలా ఏదైనా చేయవచ్చు. గత 10 ఏళ్లుగా ఈ రకమైన కామ-రతుల వేడుక జిల్లాలోని రాంబెనూరు నగరంలోని అనేక ప్రాంతాల్లో నిర్వహించారు.