తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'బంగాల్ ప్రజలను కించపరుస్తున్న దీదీ' - modi in hoogly

టీఎంసీ నేతలు, మమతా బెనర్జీ ఆలోచనా విధానం వల్ల బంగాల్​ అభివృద్ధికి ఆటంకం ఏర్పడిందని ప్రధాని మోదీ అన్నారు. హూగ్లీ అరంబాగ్​ ప్రచార సభలో పాల్గొన్న ఆయన మమతా బెనర్జీపై విమర్శలు ఎక్కుపెట్టారు.

modi in WB
'దీదీ బంగాల్ ప్రజలను కించపరుస్తున్నారు'

By

Published : Apr 3, 2021, 4:06 PM IST

Updated : Apr 3, 2021, 5:57 PM IST

ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బంగాల్ అభివృద్ధికి అడ్డంకిగా మారారని అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. మమత.. బంగాల్​ ప్రజల మనోభావాలను దెబ్బతీసిందని పేర్కొన్నారు. డబ్బులు తీసుకుని భాజపా ర్యాలీకి ప్రజలు వస్తున్నారని దీదీ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు. ఈవీఎంలు, ఈసీపై మమత పలుమార్లు ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా విమర్శించారు.

"టీఎంసీ నేతలు, మమత ఆలోచనా విధానం వల్ల బంగాల్​కు పరిశ్రమలు రాలేదు. అభివృద్ధికి ఆటంకం ఏర్పడింది. 2006-08లో టాటా మోటార్స్​ను వ్యతిరేకిస్తూ సింగూర్​లో జరిగిన ఉద్యమమే ఇందుకు నిదర్శనం. స్వలాభం కోసం దీదీ.. అభివృద్ధికి అడ్డంకిగా మారడమేంటి?."

--నరేంద్ర మోదీ, ప్రధాని.

కేంద్రం అమలు చేసిన పథకాలనూ దీదీ రాష్ట్రంలో అమలు కానివ్వకుండా చూశారని మోదీ అరోపించారు. బంగాల్​లో భాజపా అధికారంలోకి రాగానే పీఎం కిసాన్​ నిధిని అమలు చేస్తామని వ్యాఖ్యానించారు. మే 2న ఎన్నికల ఫలితాల తర్వాత నందిగ్రామ్​లో దీదీ భవిత్యమేంటో తెలుస్తుందని అన్నారు.

బంగాల్​లో మూడో దశ పోలింగ్​ జరగనున్న నేపథ్యంలో హూగ్లీలోని అరంబాగ్​ ప్రచార సభలో పాల్గొన్న మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇదీ చదవండి:'కేరళ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకే మోదీ యత్నం'

Last Updated : Apr 3, 2021, 5:57 PM IST

ABOUT THE AUTHOR

...view details