తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'వినాశకాలే విపరీత బుద్ధి.. దీదీ పరిస్థితి ఇదే'

మమతా బెనర్జీ పరిస్థితి వినాశకాలే విపరీత బుద్ధి అన్న సామెతలా మారిందని ప్రధాని మోదీ ఎద్దేవా చేశారు. తనతో పాటు బడుగు బలహీనవర్గాలపై దీదీ బహిరంగ యుద్ధం ప్రకటించారని అన్నారు. ఎన్నికల్లో భాజపా విజయం ఖాయమైందని.. ఈ విషయంపై మమత కోపంగా ఉన్నారని చెప్పుకొచ్చారు.

modi campaign in bengal
మోదీ బంగాల్ ప్రచారం

By

Published : Apr 12, 2021, 4:39 PM IST

Updated : Apr 12, 2021, 5:02 PM IST

బంగాల్​ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ, ఆమె పార్టీ పరిస్థితి 'వినాశకాలే విపరీత బుద్ధి'లా మారిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధ్వజమెత్తారు. అందువల్లే తనతో పాటు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలపై బహిరంగ యుద్ధం ప్రకటించారని చెప్పారు. బారాసత్​లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న ఆయన.. దీదీకి ప్రతి విషయంలో కోపం వస్తోందని ఎద్దేవా చేశారు.

"మీ(సభికులను ఉద్దేశించి) ఫోన్లలో ఫ్లాష్​లైట్లు ఆన్ చేసి ఈ ప్రాంతంలో వెలుగులు నింపడాన్ని చూస్తే మే రెండో తేదీ మీకు అప్పుడే వచ్చేసిందని తెలుస్తోంది. నాపై మీకున్న ప్రేమ.. దీదీని బాధపెడుతోంది. నాలుగు దశల ఎన్నికల తర్వాత భాజపా విజయం ఖాయమైన విషయంపై మమత కోపంగా ఉన్నారు."

-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

శాంతియుత ఎన్నికలను మమత ఎప్పుడూ కోరుకోలేదని అన్నారు మోదీ. భారీ సంఖ్యలో ప్రజలు భాజపాకు ఓటేస్తారని దీదీకి తెలుసని.. అందుకే అధిక ఓటింగ్ శాతాన్ని మమత వ్యతిరేకిస్తారని చెప్పారు. బంగాల్​లో హింసకు మమతా బెనర్జీనే బాధ్యురాలని ఆరోపించారు. 'హింసకు కారణం తన గూండాలేనని దీదీకి తెలుసు. కాబట్టి వాటి గురించి ఆమె మాట్లాడరు. ప్రతిదీ ఆమె కనుసన్నల్లోనే జరుగుతోంది' అని చెప్పారు మోదీ.

బంగాల్ ప్రజలు చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు తెలిపారు మోదీ. ఈ ప్రేమను వడ్డీతో కలిపి తిరిగి చెల్లిస్తానని హామీ ఇచ్చారు.

ఇదీ చదవండి:'బంగాల్​​లో భాజపా సెంచరీ.. మమత క్లీన్ బౌల్డ్'

Last Updated : Apr 12, 2021, 5:02 PM IST

ABOUT THE AUTHOR

...view details