తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఉద్యోగులకు దీపావళి గిఫ్ట్​గా సోలార్​ ప్యానల్స్.. ఇక కరెంట్ బిల్​ నుంచి విముక్తి!

గుజరాత్​కు చెందిన ఓ వజ్రాల వ్యాపారి తమ ఉద్యోగులకు దీపావళి బోనస్​గా సౌర ఫలకాలను ఇచ్చారు. సౌర ఫలకాలు ఇవ్వడం వల్ల పర్యావరణాన్న కాపాడడం సహా.. తమ ఉద్యోగులకు విద్యుత్ బిల్లులు మిగులుతాయని తెలిపారు. ఆయన ఎవరో తెలుసుకోవాలంటే ఓ సారి ఈ కింది స్టోరీ చూద్దాం.

businessman gifts to solar panels
ఉద్యోగులకు సౌర ఫలకాలు ఇచ్చిన వజ్రాల వ్యాపారి

By

Published : Oct 21, 2022, 7:26 PM IST

పండుగలు వచ్చాయంటే సంస్థ యజమానులు.. ఉద్యోగులకు బోనస్​లు, కానుకలు ఇవ్వడం సహజమే. ఇప్పటివరకు పలువురు వ్యాపారులు కార్లు, అపార్ట్​మెంట్లు, ఆభరణాలు ఉద్యోగులకు కానుకగా ఇచ్చారని విన్నాం. అయితే గుజరాత్​లోని సూరత్​కు చెందిన గోవింద్ ధోలాకియా అనే వ్యాపారవేత్త మాత్రం దీపావళి కానుకగా తమ సంస్థలోని 1,000 మంది ఉద్యోగులకు సౌర ఫలకాలను అందించారు.

ఎస్​ఆర్​కే ఎక్స్​పోర్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ యజమాని గోవింద్ ధోలాకియా ప్రతి సంవత్సరం మాకు దీపావళికి కానుకలు ఇస్తారు. గతేడాది గ్యాస్ స్టవ్, గ్యాస్ సిలిండర్​ ఇచ్చారు. ఈ ఏడాది అంతకన్నా మేలైన సౌర ఫలకాలను అందించారు. ఈ సోలార్ ప్యానళ్ల వల్ల పర్యావరణానికి హాని ఉండదు. విద్యుత్ ఖర్చులు మిగులుతాయి. నాతో సహా ఉద్యోగులందరూ లాభపడతారు.

--అశిశ్, ఉద్యోగి

ఉద్యోగులకు సౌర ఫలకాలు ఇచ్చిన వజ్రాల వ్యాపారి

గ్లోబల్ వార్మింగ్ వల్ల పర్యావరణం దెబ్బతింటోందని అన్నారు యజమాని గోవింద్ ధోలాకియా. అందుకే 1,000 మంది ఉద్యోగులకు సోలార్ ప్యానళ్లను కానుకగా ఇచ్చామని తెలిపారు. పర్యావరణాన్ని కాపాడేందుకు, ఉద్యోగులకు విద్యుత్​కు అయ్యే ఖర్చును తగ్గేందుకు కంపెనీలోని ఉద్యోగులకు సౌర ఫలకాలను అందిస్తున్నామని పేర్కొన్నారు.

సౌర ఫలకాలతో ఉద్యోగులు

మరో ఉద్యోగి జయేశ్ మాట్లాడుతూ 'నేను గత 15 సంవత్సరాలుగా కంపెనీలో పనిచేస్తున్నా. ప్రతి ఏడాది దీపావళికి కానుకలు అందజేస్తారు. ఈ సారి సోలార్ ప్యానెళ్లను అందించారు. ఈ ప్యానళ్ల వల్ల విద్యుత్ ఖర్చు తగ్గుతుంది. మా యజమాని మమ్మల్ని సొంత కుటుంబంలా చూసుకుంటారు' అని తెలిపారు.

ఉద్యోగులకు సౌర ఫలకాలు ఇచ్చిన వజ్రాల వ్యాపారి
.

ఇవీ చదవండి:'విద్వేష ప్రసంగాలు చేసేవారిపై తక్షణ చర్యలు.. ఫిర్యాదు అందకపోయినా..'

'ఈయన తాగుబోతు!'.. 52వేల ఇళ్లకు పోస్టర్లు అంటిస్తున్న ప్రభుత్వం

ABOUT THE AUTHOR

...view details