తెలంగాణ

telangana

ETV Bharat / bharat

12th Fail ఇంగ్లిష్ టీచర్- ఇన్​స్టాలో క్లాస్​లు సూపర్​ హిట్- భారీగా ఆదాయం! - యువకుడి ఇంగ్లిష్ పాఠాలు

Dhiraj Takri English Classes In Social Media : ఇంటర్​ ఫెయిల్! అయినా భయపడలేదు. అక్కడితో చదువు ఆపేసి ఇంగ్లిష్​పై దృష్టిపెట్టాడు. యూట్యూబ్ చూసి ఆంగ్లం నేర్చుకున్నాడు. ఇప్పుడు ఇన్​స్టా, యూట్యూబ్, ఫేస్​బుక్​లో అమెరికన్ ఇంగ్లిష్ పాఠాలను చెబుతున్నాడు. నాలుగు నెలల క్రితం వందల్లో ఉన్న అతడి ఇన్​స్టా ఫాలోవర్స్ సంఖ్య ప్రస్తుతం 9 లక్షల దాటింది. ఒడిశాకు చెందిన యువకుడి విజయగాథ మీకోసం.

Dhiraj Takri English Classes In Social Media
Dhiraj Takri English Classes In Social Media

By ETV Bharat Telugu Team

Published : Jan 11, 2024, 8:01 PM IST

12th Fail ఇంగ్లిష్ టీచర్- ఇన్​స్టాలో క్లాస్​లు సూపర్​ హిట్- భారీగా ఆదాయం!

Dhiraj Takri English Classes In Social Media :చదివింది పదో తరగతి. అయితేనేం అనుకున్నది సాధించాలనుకున్నాడు ఓ యువకుడు. పట్టుదలతో యూట్యూబ్, ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా ఇంగ్లిష్​ నేర్చుకున్నాడు. అలా నేర్చుకున్న భాషను ఇన్​స్టాగ్రామ్​, ఇతర సోషల్ మీడియా సైట్స్​లో పాఠాలుగా చెబుతున్నాడు. ఇప్పుడు అతడికి ఇన్​స్టాగ్రామ్​లోనే 9లక్షల మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. నైకీ షూ, ఇంగ్లిష్ లెర్నింగ్ ఫ్లాట్​ఫాం ఇన్​క్నా, అమెరికన్ ఇడియమ్ బుక్ వంటి కంపెనీలను ప్రమోట్ చేస్తున్నాడు. అతడే ఒడిశాలోని నబరంగ్​పుర్​కు చెందిన ధీరజ్ టక్రీ.

ధీరజ్ టక్రీ

నబరంగ్​పుర్​ జిల్లాలోని చిట్టకోట్​ గ్రామానికి 21 ఏళ్ల ధీరజ్ చదివింది పదో తరగతే అయినా ఇంగ్లిష్ నేర్చుకోవాలనే కుతుహలంతో ఉండేవాడు. చిన్నప్పటి నుంచి తనకంటూ సొంత గుర్తింపును తెచ్చుకోవాలని ప్రయత్నించేవాడు. ఇంటర్ ఫెయిల్ అయిన ధీరజ్ ఇంగ్లిష్ నేర్చుకుంటే విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు వస్తాయని నమ్మేవాడు. అందుకే చదువు ఆపేసి ఇంగ్లిష్​ నేర్చుకోవడంపై శ్రద్ధ పెట్టాడు. 2019 నుంచి ధీరజ్​ అనేక ఆంగ్ల పుస్తకాలను చదివాడు. అంతేకాకుండా యూట్యూబ్​లో ఇంగ్లిష్ క్లాసులు విన్నాడు. ఈ క్రమంలో ధీరజ్​కు 2020లో అమెరికన్ ఇంగ్లిష్ నేర్చుకోవాలని ఆశ కలిగింది. అలా అమెరికన్ ఇంగ్లిష్​ను కూడా కష్టపడి నేర్చుకున్నాడు ధీరజ్​.

ధీరజ్ టక్రీ

ఈ తర్వాత అమెరికన్ ఇంగ్లిష్​ను ఎలా నేర్చుకోవాలి అనే పాఠాలను రికార్డ్ చేసి యూట్యూబ్, ఇన్​స్టాగ్రామ్​, ఫేస్​బుక్​లలో అప్​లోడ్ చేశాడు. తొలుత అతడికి ఆశించిన స్థాయిలో సోషల్ మీడియాలో ఫాలోవర్స్ రాలేదు. 2023 సెప్టెంబర్ 7 నాటికి అతడికి ఇన్‌స్టా ఫాలోవర్స్ సంఖ్య కేవలం 165మంది మాత్రమే. కానీ ధీరజ్ ఇంగ్లీష్ టీచింగ్ నచ్చడం వల్ల ఒక్కసారిగా ఫాలోవర్స్ పెరిగిపోయారు. కొద్ది రోజుల్లోనే ధీరజ్​కు ఇన్​స్టా ఫాలోవర్స్​ 9లక్షల దాటిపోయారు. ఇప్పటివరకు ధీరజ్ ఇన్​స్టాలో​ 94వీడియోలను పోస్ట్ చేశాడు. ధీరజ్​కు భారత్​లోనే కాకుండా అమెరికాలో 18వేలు, కెనడాలో 9వేలు, యూకే 8వేల మంచి ఇన్​స్టా ఫాలోవర్స్ ఉన్నారు. ప్రస్తుతం ధీరజ్ సోషల్ మీడియాలో ఇంగ్లిష్ ఇన్​ఫ్లూయెన్సర్​గా మారిపోయాడు.

వీడియోలు ఎడిటింగ్ చేస్తున్న ధీరజ్ టక్రీ

ధీరజ్​ది మధ్య తరగతి కుటుంబం. అతడి తండ్రి సైకిల్ రిపేరు షాపు నడుపుతుంటాడు. పేదరికంలో ఉన్నా ధీరజ్​కు అతడి కుటుంబం అన్నివేళలా అండగా నిలిచింది. ధీరజ్ సోషల్ మీడియాలో ఇంత స్థాయిలో ఫేమస్ కావడం వల్ల అతడి కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ధీరజ్ సోషల్ మీడియా ఫాలోయింగ్ చూసి అగ్రశ్రేణి కంపెనీలు తమ బ్రాండ్​ను ప్రమోట్​ చేయాలని కోరుతున్నాయి. రాబోయే రోజుల్లో అమెరికన్ ఇంగ్లిష్, ఆంగ్ల భాషను బోధించడానికి కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌ను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు ధీరజ్​.

ABOUT THE AUTHOR

...view details