Karnataka gang rape: కర్ణాటక ధార్వాడ్లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ 17ఏళ్ల బాలికపై కొందరు మైనర్లు.. మూడు నెలల పాటు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఎవరికైనా చెబితే.. ఆమె వీడియోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసి వైరల్ చేస్తామని బెదిరించారు.
బాలికపై మైనర్ల సామూహిక అత్యాచారం- మూడు నెలల పాటు.. - సామూహిక అత్యాచారం
Dharwad gang rape: ఓ బాలికపై కొందరు మైనర్లు సామూహిక అత్యాచారానికి పాల్పడిన జరిగిన ఘటన కర్ణాటకలో వెలుగులోకి వచ్చింది. మూడు నెలల పాటు వారు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ వ్యవహారంలో పోలీసులు ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు.
మైనర్పై సామూహిక అత్యాచారం- మూడు నెలల పాటు..
ఒకరోజు బాధ తట్టుకోలేకపోయిన ఆ బాలిక.. జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు వివరించింది. బాధితురాలి తల్లిదండ్రులు.. షహర్ పోలీస్ స్టేషన్లో ఆదివారం ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఇప్పటివరకు ఆరుగురిని కస్టడీలోకి తీసుకున్నారు. ఈ ఘటనపై విచారణను ముమ్మరం చేశారు.
ఇదీ చూడండి:-14 ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్- 9 మంది అరెస్ట్!