Uttarakhand Election 2022: ఉత్తరాఖండ్‌లో రెండోసారి అధికారం నిలబెట్టుకోవాలని భావిస్తున్న భారతీయ జనతా పార్టీ.. 10 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను పక్కనపెట్టింది. ఇక్కడ 70 శాసనసభ స్థానాలు ఉండగా 59మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను ఉత్తరాఖండ్ భాజపా వ్యవహారాల బాధ్యుడు ప్రహ్లాద్ జోషి దిల్లీలో విడుదల చేశారు.
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామితోపాటు 11 మంది మంత్రులు, ఉత్తరాఖండ్ భాజపా అధ్యక్షుడు మదన్ కౌషిక్‌కు.. ప్రస్తుతం వారు ప్రాతినిథ్యం వహిస్తున్న స్థానాలే కేటాయించారు.
తొలి జాబితాలో ఐదుగురు మహిళలకు చోటు కల్పించారు. త్వరలోనే మిగతా 11స్థానాలకు అభ్యర్థులను ప్రకటించనున్నట్లు ప్రహ్లాద్ జోషి తెలిపారు.