Omicron Vaccine SII: ఒమిక్రాన్ వేరియంట్ రూపంలో వచ్చిన కరోనా వైరస్ మహమ్మారి మరోసారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తూనే ఉంది. అయితే, ఈ వేరియంట్‌ను ఎదుర్కొనే టీకా తయారు చేసే పనిలో ఇప్పటికే ఫార్మా సంస్థలు నిమగ్నమయ్యాయి. ఈ నేపథ్యంలో ఒమిక్రాన్‌ను నిరోధించే వ్యాక్సిన్ పరీక్షలు, విశ్లేషణ కోసం అవసరమైన వ్యాక్సిన్‌ను తయారు చేస్తామని సీరం ఇన్‌స్టిట్యూట్ చేసిన ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఇందుకోసం డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతి ఇచ్చినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించింది.
ఒమిక్రాన్.. పరిశీలన టీకా తయారీకి అనుమతి పొందిన సీరం - అనుమతి పొందిన ఒమిక్రాన్ పరిశీలన టీకా
Omicron Vaccine SII: ఒమిక్రాన్‌ను నిరోధించే వ్యాక్సిన్ పరీక్షలు, విశ్లేషణ కోసం అవసరమైన టీకాను తయారు చేస్తామని సీరం ఇన్‌స్టిట్యూట్ చేసిన ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఇందుకోసం డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతి ఇచ్చినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
'మీ దరఖాస్తును పరిశీలించిన అనంతరం, పరిశీలన, పరీక్ష, విశ్లేషణ కోసం ఒమిక్రాన్ వేరియంట్‌ను ఎదుర్కొనే వ్యాక్సిన్ తయారీకి అనుమతి ఇస్తున్నాం' అంటూ సీరం ఇన్‌స్టిట్యూట్‌కు భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ) తెలియజేసింది. అంతకుముందు ఒమిక్రాన్ వేరియంట్‌ను ఎదుర్కొనే వ్యాక్సిన్ అభివృద్ధి కోసం నోవావాక్స్‌తో కలిసి పనిచేస్తున్నట్లు జనవరి నెలలో డీసీజీఐకి సమర్పించిన ప్రతిపాదనలో సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రతినిధి ప్రకాశ్ కుమార్ సింగ్ పేర్కొన్నారు. ఇప్పటికే చాలా దేశాలకు ఈ వేరియంట్ విస్తరించిన నేపథ్యంలో దీన్ని ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్ తయారు చేసేందుకు సీరం సీఈఓ అదర్ పూనావాలా కృతనిశ్చయంతో ఉన్నట్లు అందులో వెల్లడించారు. సీరం ఇన్‌స్టిట్యూట్ ప్రతిపాదనను పరిశీలించిన డీసీజీఐ.. ప్రయోగ వ్యాక్సిన్ తయారీకి అనుమతి ఇచ్చింది.
ఇదీ చూడండి:'కొవిన్‌లో టీకా రిజిస్ట్రేషన్‌కు ఆధార్ తప్పనిసరి కాదు'