5-18 ఏళ్ల లోపు వారి కోసం హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్-ఈ లిమిటెడ్ రూపొందించిన స్వదేశీ కొవిడ్-19 వ్యాక్సిన్ 2-3 దశల క్లినికల్ ట్రయల్స్‌కు ఆమోదం లభించింది. డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) అనుమతించినట్లు సంస్థ వర్గాలు తెలిపాయి.
బయోలాజికల్ ఈ 'పిల్లల టీకా' మూడో దశ ట్రయల్స్‌కు అనుమతి
ఐదు నుంచి 18 ఏళ్లలోపు పిల్లలకు అందించేందుకు స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన బయోలాజికల్-ఈ సంస్థ కొవిడ్ వ్యాక్సిన్ 2, 3 దశ క్లినికల్ ట్రయల్స్‌కు డీసీజీఐ ఆమోదం తెలిపింది. నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు అనుమతించినట్లు సంస్థ వర్గాలు తెలిపాయి.
బయోలాజికల్ ఈ వ్యాక్సిన్
డీజీసీఐ నిబంధనల మేరకు రెండు, మూడు దశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించనున్నట్లు సంస్థ వర్గాలు తెలిపాయి. కొవిడ్-19పై ఏర్పాటైన నిపుణుల కమిటీ (ఎస్ఈసీ) సిఫార్సుల మేరకు డీసీజీఐ అనుమతించినట్లు చెప్పారు.
12-18 ఏళ్ల లోపు వారికి ఇచ్చేందుకు రూపొందించిన జైడస్ క్యాడిలా నీడిల్ ఫ్రీ వ్యాక్సిన్ జైకోవ్-డీ అత్యవసర వినియోగానికి ఇటీవలే అనుమతించింది డీజీసీఐ. మరోవైపు.. 2-18 ఏళ్ల వారిపై కొవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి.
Last Updated : Sep 2, 2021, 7:00 PM IST