అయోధ్యలో రామ మందిర(Ayodhya Ram Mandir) నిర్మాణ పనులు షెడ్యూల్ ప్రకారమే జరుగుతున్నాయని ఆలయ ట్రస్ట్ వర్గాలు(Ayodhya Temple Trust) పేర్కొన్నాయి. 2023నాటికి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తామని తెలిపాయి. రామమందిర నిర్మాణ పనులపై ఆగస్టు 27 - 29 మధ్య సమీక్షా సమావేశాలు నిర్వహించినట్లు వెల్లడించారు ట్రస్ట్ సభ్యులు.
"ఆలయ ప్రాంగణం బయట చేపట్టే నిర్మాణాలకు సంబంధించి మాస్టర్ ప్లాన్ సిద్ధమైంది. డిజైన్లు, డ్రాయింగ్ పనులు పూర్తి అయ్యాయి. మండపాలు, మ్యాజియం, ఆర్కైవ్స్, ఆడిటోరియం, గోశాల, యోగశాలలను నిర్మిస్తున్నాం. ఇందుకోసం 3 లక్షల చదరపు అడుగుల కాంక్రీటును వినియోగిస్తున్నాం. వారసత్వ కట్టడాల పరిరక్షణ, అభివృద్ధే లక్ష్యంగా మాస్టర్ ప్లాన్ను తయారు చేశాం"
-అయోధ్య ఆలయ ట్రస్ట్ వర్గాలు