తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దేశంలో ఘనంగా దీపావళి- నరకాసుర వధతో సంబరాలు

దేశమంతటా దీపావళి వేడుకలు అంగరంగవైభంగా జరుగుతున్నాయి. ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. పలుచోట్ల నరకాసుర వధ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

Diwali images
దీపావళి వేడుకలు

By

Published : Nov 4, 2021, 1:06 PM IST

దేశ ప్రజలు దీపావళి పండగను ఘనంగా జరుపుకుంటున్నారు. అయోధ్య మొద‌లుకుని దేశం నలుమూలలా అన్ని ఆల‌యాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు.

గోవా రాజధాని పనాజీలో ఉదయమే నరకాసుర వధ కార్యక్రమం నిర్వహించారు. నరకాసురుడి బొమ్మ దహనం చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు.

నరకాసుర వధకు సిద్ధం చేసిన బొమ్మలు

ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ ఆల‌యాన్ని 800 కిలోల పూల‌తో అలంకరించారు. మంచు కొండ‌ల న‌డుమ నిండా పూల‌తో ముస్తాబు అయిన ఈ ఆల‌యం చూడముచ్చటగా కనిపిస్తోంది.

పూలతో అలంకరించిన కేదార్‌నాథ్ ఆల‌యం

బద్రీనాథ్‌ ఆలయాన్ని కూడా పూలతో ముస్తాబు చేశారు.

బంగాల్​లోని దక్షిణేశ్వర్‌లో కాళీమాత ఆలయానికి పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు ప్రత్యేక పూజలు చేశారు.

కాళీమాత ఆలయంలో ప్రత్యేక పూజలు

ఉత్తర్​ప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​ అయోధ్యలోని రామ్​ లల్లా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆ పక్కనే ఉన్న హనుమాన్ దేవాలయంలో అనేక మంది భక్తులు ప్రార్థనలు చేశారు.

ప్రత్యేక పూజలో పాల్గొన్న ఉత్తర్​ప్రదేశ్​ సీఎం యోగి ఆదిత్యనాథ్​
అయోధ్య హనుమాన్​ ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తున్న భక్తులు

కేరళలోని శ్రీ అనంతపద్మనాభ స్వామి ఆలయానికి భారీగా భక్తులు తరలివచ్చారు.

కేరళలో శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం

తమిళనాడులో మధుర, కోయంబత్తూర్‌ తదితర ప్రాంతాల్లో ఉదయం నుంచే ప్రజలు బాణా సంచా కాలుస్తూ సంబరాలు చేసుకున్నారు.

దీపావళి సందర్భంగా దిల్లీ, ముంబయి, కోల్‌కతా సహా ప్రధాన నగరాల్లోని మార్కెట్లన్నీ కిటకిటలాడుతున్నాయి.

ఇదీ చూడండి:దేశవ్యాప్తంగా ఆలయాలు, నగరాలకు 'దీపావళి' వెలుగులు

ABOUT THE AUTHOR

...view details