తెలంగాణ

telangana

By

Published : Dec 25, 2020, 12:02 PM IST

ETV Bharat / bharat

దేశవ్యాప్తంగా ఘనంగా క్రిస్మస్​ వేడుకలు

క్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా క్రిస్మస్​ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పండుగ సందర్భంగా ఆయా రాష్ట్రాల్లోని చర్చిలు సుందరంగా ముస్తాబవ్వగా.. క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు చేపట్టారు.

Devotees gather for Christmas prayers at a churches in India
దేశవ్యాప్తంగా ఘనంగా క్రిస్మస్​ వేడుకలు

దేశవ్యాప్తంగా క్రిస్మస్​ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. క్రీస్తు జన్మదినం సందర్భంగా చర్చిలన్నీ అంగరంగ వైభవంగా ముస్తాబయ్యాయి. కేరళ తిరువనంతపురంలోని సెయింట్​ జోసెఫ్​ మెట్రోపాలిటన్​ కేథడ్రాల్​లో ప్రార్థనలు చేసేందుకు జనం భారీగా తరలివచ్చారు.

కేరళలో క్రిస్మస్​ వేడుకలు
తిరువనంతపురంలోని చర్చి ముస్తాబైందిలా..
మాస్కులు ధరించి ప్రార్థనలకు హాజరు

ఒడిశా భువనేశ్వలోని ఓ చర్చిలో క్రిస్మస్​ సంబరాలు చేసుకొనేందుకు పెద్దఎత్తున గుమిగూడారు క్రైస్తవులు.

భువనేశ్వర్​ చర్చిలో క్రిస్మస్​ ప్రత్యేక ప్రార్థనలు
కరోనా నిబంధనల నడుమ ప్రార్థనలు చేస్తున్నారిలా..

రాష్ట్రపతి శుభాకాంక్షలు

క్రిస్మస్​ పర్వదినం సందర్భంగా భారత రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ దేశ ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు. సమాజంలో సామరస్యాన్ని పెంపొందించేందుకు ఈ పండుగ దోహదం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రేమ, సేవాగుణంతో క్రీస్తు బోధనలను అనుసరించాలని.. తద్వారా దేశ సంక్షేమానికి పాటుపడాలని కోరుతూ ట్వీట్​ చేశారు.

రాష్ట్రపతి కార్యాలయం ట్వీట్​

"అందరికీ క్రిస్మస్​ శుభాకాంక్షలు. ఈ పండుగ శాంతి, శ్రేయస్సులను పెంపొందించి.. సమాజంలో సామరస్యాన్ని బలోపేతం చేసేందుకు దోహదపడుతుందని ఆశిస్తున్నాను. క్రీస్తు బోధనలను అనుసరించి దేశ సంక్షేమానికి కట్టుబడి ఉందాం."

- రాష్ట్రపతి కార్యాలయం ట్వీట్​

ఇదీ చూడండి:మాస్కుల వాడకంపై 'శాంటాక్లాజ్'తో సందేశం

ABOUT THE AUTHOR

...view details